సీతారాముల కళ్యాణ మహోత్సవంలో జిల్లెల చిన్నారెడ్డి ప్రత్యేక పూజలు
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణంలోని రామాలయం, మర్రికుంట ఆంజనేయ స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, రాంనగర్ రామాలయం లో పలు దేవాలయాల లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు హాజరై శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాని వీక్షించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రజలు అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.ధర్మసంస్థాపనకై అవతరించిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పరిపూర్ణంగా నిలవాలని అని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు చిన్నారెడ్డిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు కోట్ల రవి, వెంకటేశ్వర్ రెడ్డి, గోపాల్పేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటర్ జిల్లెల ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీర్ల జనార్ధన్, దాసరాజు భాస్కర్ ,మాజీ సర్పంచ్ సురేష్, రాంజీ నాయక్ ,చీర్ల రాములు,చీర్ల ఆంజనేయులు,చీర్ల మన్నెంకొండ,చీర్ల నాగ స్వామి.
వనపర్తి మున్సిపల్ మాజీవైస్ చైర్మన్ బి. కృష్ణ, రెండో వార్డ్ కౌన్సిలర్ బి. రమాదేవి,సత్యం, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు ,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.(Story : సీతారాముల కళ్యాణ మహోత్సవంలో జిల్లెల చిన్నారెడ్డి ప్రత్యేక పూజలు )