దాన్యం కొనుగోలు సెంటర్లను దళారుల నుండి కాపాడండి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము
న్యూస్ తెలుగు / వినుకొండ : శుక్రవారం వినుకొండ మండల తాహాసిల్దార్ కి ధాన్యం కొనుగోలు సెంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని శుక్రవారం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులు పండించిన ప్రతి ధాన్యం బస్తాను ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటికే చాలామంది రైతులకు ధాన్యం వచ్చి ఉండటంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో బోకర్ల మాయలో పడి తక్కువ ధరకు రైతులు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. గత ఏడాది ఈపాటికి ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి 100 కేజీల దాన్యం బస్తాను 2200 కొనుగోలు చేసి ఉంది. కూటమి ప్రభుత్వం 100 కేజీలను 2300 రూపాయలకు కొనుగోలు చేస్తావని చెప్తున్నారు. అయితే ఈ ఏడాది మన పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ధాన్యం వచ్చి ఉండటంతో ధాన్యం బోకర్లు రైతులను మభ్యపెట్టి 1500 రూపాయల లోపే రైతులు వద్ద నుండి ఒక దాన్యం బస్తాను కొనుగోలు చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసినట్లయితే దళారీ వ్యవస్థనుండి రైతుల్ని కాపాడైన వారు అవుతారని రైతుల ఆరుగాలం కష్టం దోపిడీకి గురి అవ్వకుండా అరె కట్టిన వారు అవుతారని. కూటమి ప్రభుత్వాన్ని రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తుందని రాము కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ బృందం లో రైతు సంఘం వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కాకర్ల కొండలు, రైతు నాయకులు పగడాల సుధాకర్ రెడ్డి, బ్రహ్మం, బాలస్వామి, వెంకయ్య పాల్గొన్నారు. (Story : దాన్యం కొనుగోలు సెంటర్లను దళారుల నుండి కాపాడండి)