ఘనంగా75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన గురుకుల బాలుర పాఠశాల నందు గురువారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అన్ని రంగాలలో, ప్రగతి పథంలో, అభివృద్ధిలో, సుస్థిరమైన పునాది కల్పించిన భారత్ రాజ్యాంగం 75వ వసంతంలో అడుగుపెట్టేందుకు చారిత్రకమైన ఘట్టాన్ని దేశవ్యాప్తంగా వాడవాడలా, వేడుకగా జరుపుకోవాలని, కుల, మత, జాతి, వివక్ష వర్ణ భేదం లేకుండా ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే భారత రాజ్యాంగ లక్ష్యమని భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని కొనియాడుతూ విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు. ఏ.టి.పి. రాధా, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. (Story : ఘనంగా75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు)