వృద్ధుల్లో ఆత్మ సైర్యాన్ని పెంచేందుకే 30వ తేదీన పెన్షన్ పంపిణీ
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వృద్ధుల ఆత్మ సైర్యాన్ని కాపాడడానికి వితంతువుల ఆర్థిక సాయానికి వికలాంగుల మనోబలానికి తోడ్పాటు నివ్వడమే ప్రథమ కర్తవ్యంగా భావించే ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమం ప్రతినెలా ఒకటవ తేదీన విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని రాబోవు నెల డిసెంబర్ 1వ తేదీ ఆదివారమైనందున ఒక రోజు ముందుగా నవంబర్ 30కి పెన్షన్ పంపిణీని రీషెడ్యూల్ చేయబడిందని. కావున పట్టణం వెలుపల ఉన్న ప్రతి పెన్షనర్ నవంబర్ 30 వ తేదీన పెన్షన్ పంపిణీ చేయు అధికారులకు అందుబాటులో ఉండాలని వృద్ధులు వికలాంగులు మరియు వితంతువులతో సహా బలహీన జనాభాకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి అందరూ సహకరించాలని కమీషనర్ సుభాష్ చంద్రబోస్ ఒక ప్రకటనలో తెలిపారు. (story : వృద్ధుల్లో ఆత్మ సైర్యాన్ని పెంచేందుకే 30వ తేదీన పెన్షన్ పంపిణీ)