UA-35385725-1 UA-35385725-1

ముఖ్యమంత్రి చంద్రబాబుతో చీఫ్‌ విప్‌, విప్‌ల మర్యాదపూర్వక భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబుతో చీఫ్‌ విప్‌, విప్‌ల మర్యాదపూర్వక భేటీ

న్యూస్ తెలుగు /వినుకొండ : అసెంబ్లీలో చీఫ్‌విప్‌గా నియామకమైన వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మిగిలిన విప్‌లు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి నియామక ప్రకటన, బుధవారం అందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో వారంతా అసెంబ్లీ ఆవరణలోని సీఎం కార్యాలయంలోనే చంద్రబాబును కలసి సమావేశం అయ్యారు. చీఫ్‌ విప్‌గా జీవీ సహా 15మంది నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇదే సమయంలో చీఫ్‌ విప్ జీవీ ఆంజనేయులు, విప్‌లు ఆదినారాయణ రెడ్డి, అరవ శ్రీధర్‌, బెందాళం అశోక్, బొలిశెట్టి శ్రీనివాస్, బోండా ఉమా మహేశ్వరరావు, దాట్ల సుబ్బరాజు, యనమల దివ్య, వీఎం థామస్, తోయాక జగదీశ్వరి, కాల్వ శ్రీనివాసులు, రెడ్డప్పగారి మాధవి, గణబాబు, తంగిరాల సౌమ్య, యర్లగడ్డ వెంకటరావు ముఖ్యమంత్రిని కలసినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు వారిపై పెట్టిన నమ్మకం మేరకు సమర్థంగా సేవలు అందించాలని, పార్టీకి, కూటమి పక్షాలకు ప్రభుత్వానికి మంచిపేరు తీసుకుని రావాలని సూచించారని చీఫ్‌ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు.(Story: ముఖ్యమంత్రి చంద్రబాబుతో చీఫ్‌ విప్‌, విప్‌ల మర్యాదపూర్వక భేటీ)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1