వై.యస్.రాజశేఖర్ రెడ్డి 15 వ వర్ధంతి వేడుకలు
న్యూస్‌తెలుగు /వినుకొండ : శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి వినుకొండ వారి ఆధ్వర్యంలో సంఘం కార్యాలయం నందు సోమవారం వై.యస్.రాజశేఖర్ రెడ్డి 15 వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా సంఘం అధ్యక్షుడు అరె శివారెడ్డి , సెక్రటరీ సుధాకరరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అధ్యక్షుల శివారెడ్డి మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి ఆశయాలను ప్రతి ఒక్కరు అనుసరించాలని , వారు ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వక్తి కి అందాయి ఆయన పరిపాలనలో జనం సుఖ సంతోషాలతో వున్నారని అన్నారు. అలాగె చెన్నకేశవ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి మహా నాయకుడు ,మహా నేత ఎక్కడ వుండరు అని కొనియాడారు. అలాగే రెడ్డి పెద్దలు అందరూ పాల్గొని సంఘీభావం తెలుపుతూ పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్త కృష్ణా రెడ్డి, పగడాల వెంకట రామిరెడ్డి ,మేడం జయరామిరెడ్డి , మూలకా రమతులసి రెడ్డి , గంధం బాలిరెడ్డి, కేసరి ప్రకాష్ రెడ్డి , సోము వెంకటేశ్వర రెడ్డి, మూలే బాలచెన్నారెడ్డి, బిక్కo వెంకట నారాయణ రెడ్డి, మాలపాటి భాస్కర్ రెడ్డి , ఇసిరెడ్డి రామిరెడ్డి , లేళ్ళ అంజిరెడ్డి, సుబ్బారెడ్డి , తుమ్మా రామకృష్ణారెడ్డి, కొత్త సుందర్ రెడ్డి, సోము శ్రీరామ్ రెడ్డి, సోము సుందర్ రామిరెడ్డి , జనపాల వెంకటేశ్వర రెడ్డి, పి వి. రమణా రెడ్డి, కూరపాటి అప్పిరెడ్డి, ములకా పెద యలమందారెడ్డి, నక్కా వెంకటేశ్వర రెడ్డి,పాల్గొని సంఘీభావం తెలిపారు. (Story : వై.యస్.రాజశేఖర్ రెడ్డి 15 వ వర్ధంతి వేడుకలు)