విద్యార్థుల అల్పాహారం కు విరాళం అందించిన దాతలు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని సంజయ్ నగర్ లో గల పొరపాలక బాలికల ఉన్నత పాఠశాల గత కొన్ని సంవత్సరాలుగా పదవ తరగతి ఉత్తీర్ణత లో నూటికి నూరు శాతం ఫలితాలను అందిస్తూ, పట్టణంలో మంచి గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ ఉమాపతి తనదైన శైలిలో డీఈఓ ఆదేశాల మేరకు పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం పూట అదనపు తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ అదనపు తరగతులు నిర్వహణకు ఏదో కొంత అల్పాహారం ఇవ్వాలన్న తలంపుతో గత కొన్ని సంవత్సరాలుగా దాతల సహకారంతో విద్యార్థినీలకు అల్పాహారాన్ని ఇవ్వగలుగుతున్నారు. ఇందులో భాగంగానే దాతలు బాబావాలి, హరీష్ ,పార్థ, శివప్రసాద్, చౌడయ్య, హేమ్రాజ్, వెంకట్ నారాయణ, శివ అనే దాతలు తమ వంతుగారూ .10,500 విరాళంగా హెడ్మాస్టర్ ఉమాపతికి అందజేశారు. దాతలు మాట్లాడుతూ మా వంతుగా విద్యార్థినీలు మంచి ఉత్తీర్ణత సాధించాలన్న తలంపుతోనే ఈ విరాళం ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం హెడ్మాస్టర్ ఉమాపతి దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.