ప్రతి ఫిర్యాదును శాఖధిపతులే స్వయంగా పరిశీలించాలి
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదును శాఖాధిపతులే స్వయంగా ఫీల్డ్‌లోకి వెళ్లి పరిశీలించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కమిషనర్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పారిశుధ్య నిర్వహణ, ఆక్రమణలు, సుందరీ కరణ, నేటి కులాయి, సీసీ రోడ్స్, భూగర్భ డ్రెయినేజీ, డ్రెయిన్ కల్వర్టులు, ఇంటి పట్టాలు, ఆస్తి పనుల్లో డోర్ నెంబర్ సరి చేయుట, డ్రెయినేజ్ తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో నాలుగు ఫిర్యాదులు అందగా, ప్రజా ఆరోగ్యంలో మూడు, రెవెన్యూలో రెండు మొత్తంగా 13 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ డీ.చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ జి.సృజన, ఇన్‌చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పీ.సత్యనారాయణ, పీ.సత్యనారాయణకుమారి, అమృత పతకం జేడీ, యూసీడీ ఇన్‌చార్జి పీఓ డాక్టర్ లత, ఎస్టేట్ ఆఫీసర్ టీ.శ్రీనివాస్, డీఎఫ్‌ఓ మల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. (Story : ప్రతి ఫిర్యాదును శాఖధిపతులే స్వయంగా పరిశీలించాలి)