ఈనెల 12 నుంచి ధర్మవరం రెవిన్యూ డివిజన్ పరిధిలో గ్రామసభలు
గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక
నాయకులు, ప్రజలు పాల్గొనాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపు
మీ గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇది సరైన వేదిక అన్న సునీత
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రామసభలు ఈనెల 12 నుంచి ధర్మవరం రెవిన్యూ డివిజన్ పరిధిలో ప్రారంభం కానున్నాయి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ధర్మవరం నియోజకవర్గంతో పాటు, రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాలలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ గ్రామ సభలు జరుగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ, తహసిల్దార్, ఇతర మండల అధికారులంతా హాజరవుతారని తెలిపారు. గ్రామంలో సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పై గ్రామసభలు జరగనున్నాయని,ప్రజలు తమ సమస్యలు వచ్చి నేరుగా చెప్పుకోవచ్చు అని అన్నారు. రెవిన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ కు వెళ్లి విన్నవించుకుంటారని… అయితే ఇది చాలామందికి వ్యయ ప్రయాసలతో కూడుకున్నదిగా మారిందన్నారు. అందుకే అధికారుల సేవలు మరింత విస్తృతం చేసే విధంగా గ్రామాల్లోనే గ్రామసభల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. మండలంలో ఈనెల 12 నుంచి ఈనెల 28వ తేదీ వరకు గ్రామసభలు జరగనున్నాయని, గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి కోసం, అలాగే గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా ప్రత్యేకంగా చొరవ చూపడం జరుగుతుందని తెలిపారు. (Story ; ఈనెల 12 నుంచి ధర్మవరం రెవిన్యూ డివిజన్ పరిధిలో గ్రామసభలు)