అర్జీల సత్వర పరిష్కారానికి కృషి చేయండి`కలెక్టర్
న్యూస్‌తెలుగు/ విజయవాడ : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డా.నిదిమీనా సంబందిత శాఖల అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి అర్జీదారులు సంతృప్తి చెందేలా ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఒకసారి వచ్చిన సమస్యపై తిరిగి మరల ఫిర్యాదు రాకుండా పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి రూ.123 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. (Story : అర్జీల సత్వర పరిష్కారానికి కృషి చేయండి`కలెక్టర్)