మంత్రిని కలిసిన సిపిఐ నేతలు
అజాద్ నగర్ కాలనీవాసులకు మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలి
న్యూస్‌తెలుగు/పల్నాడు జిల్లా; వినుకొండ: అజాద్ నగర్ కాలనీవాసులకు విద్యుత్ సౌకర్యం మరియు మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలి సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్. వినుకొండ పట్టణానికి గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ పర్యటన సందర్భంగా సిపిఐ వినుకొండ నియోజకవర్గ ప్రతినిధి బృందం వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవీ ఆంజనేయులు గారి నివాస గృహంలో విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కలిసి పట్టణంలోని అజాద్ నగర్ కాలనీ ప్రజలకు మౌలిక వసతులు కరెంటు సౌకర్యం వెంటనే కల్పించాలని కోరుతూ గత 18 సంవత్సరాలుగా ఆజాద్ నగర్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు 5వేల పక్కా గృహాలు నిర్మించుకొని కూలి నాలి పనులు చేసుకొనుచు జీవించుచున్నారని గత వైసిపి ప్రభుత్వం ఆజాద్ నగర్ కాలనీలో నివసిస్తున్న ప్రజలకు మున్సిపాలిటీ పంపిస్తున్న మంచినీటిని నిలుపుదల చేసి కరెంటు కట్ చేసి అచ్చటి ప్రజలను అనేక ఇక్కట్లు పాలు చేశారని చదువుకునే విద్యార్థులు రాత్రుల యందు కరెంటు లేక అనేక ఇబ్బందులు పాలయ్యారని బజారులలో ప్రయాణించు వృద్ధులు ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారని ఆయన మంత్రికి వివరించారు. కావున మంత్రివర్యులు వెంటనే అధికారులను ఆదేశించి కరెంటు సౌకర్యము మంచినీటి వసతి తదితర మౌలిక వసతులు కల్పించుటకు తగు చర్యలు గైకొన వలసిందిగా ఆయన కోరారు. వినతి పత్రం ఇస్తున్న వారిలో సిపిఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు ఎ.పి.రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము, సిపిఐ నాయకులు పి. వెంకటేశ్వర్లు, రాయబారం వందనం, కొప్పరపు మల్లికార్జున, షేక్ మస్తాన్ వలి, ఎస్ యూనిస్, షేక్ మల్లికా బేగం, షేక్ మస్తాన్, షేక్ కరీం,దూపాటి మార్కు తదితర ఆజాద్ నగర్ కాలనీ ప్రజలు ఉన్నారు. (Story : మంత్రిని కలిసిన సిపిఐ నేతలు)