కొమురం బీమ్ విగ్రహా ఆవిష్కరణ సభను జయప్రదం చేయాలి
ఆదివాసీ హక్కుల పోరాట సమితి
రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్
న్యూస్ తెలుగు /ఏటూరునాగారం ములుగు జిల్లా బ్యూరో. (వై. లకుమయ్య ) : ఏటూరునాగారం మండల కేంద్రం వై జంక్షన్ వద్ద గురువారం 12.30 గంటలకు కొమురం బీమ్ విగ్రహ ఆవిష్కరణ, సభ ఏర్పాటు చేసిన్నట్లు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ తెలిపారు.బుధవారం వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వట్టం ఉపేందర్ మాట్లాడుతూ జల్ జంగిల్, మా ఊళ్ళో మా రాజ్యం అనే అనే నినాదంతో, ఆదివాసీ ఆస్తిత్వం, కోసం,12 గుండాల, ప్రజలను, ఐక్యం, చేస్తూ, నిజాం, ప్రభుత్వంతో తమ హక్కుల కోసం, పోరాడి, వీర మరణం పొందిన, వీరుడు కొమురం బీమ్ అని, అన్నారు. కొమురం విగ్రహ ఆవిష్కరణ, సభ కు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, నీటిసరఫరా,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ, సీతక్క,ప్రత్యేక ఆహ్వానితులుగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్, జిల్లా ఎస్పీ శబరిష్, ఎ ఎస్పీ శివం ఉపాధ్యాయ, ముఖ్య అతిధిగాలుగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య,ఉమ్మడి, రాష్ట్రం ఎమ్మెల్యే లు, ఇతర రాష్టాలనుండి, ఎమ్మెల్యేలు,తదితరఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, యంపిలు హాజరు అవుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజలు, యువత, మేధావులు, జిల్లా లోని, గిరిజనులు, అన్ని వర్గాల ప్రజలు హాజరై, విగ్రహ ఆవిష్కరణ, సభను విజవంతం చేయాలని పిల్పు నిచ్చారు. ఈ సమావేశంలో పోదేం కృష్ణ ప్రసాద్, కోటయ్య,జిల్లా అధ్యక్షులు వట్టం జనార్దన్,మహిళా నాయకులు స్వరూప్, తదితరులు పాల్గొన్నారు. (story : కొమురం బీమ్ విగ్రహా ఆవిష్కరణ సభను జయప్రదం చేయాలి)