జిల్లాను డ్రగ్స్, గంజాయి రహిత జిల్లా గా మార్చేందుకు చర్యలు తీసుకోండి
జిల్లా ఎస్పీ కి విజ్ఞప్తి చేసిన గురాన అయ్యలు
న్యూస్‌తెలుగు/ విజయనగరం : గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరంతరమైన నిఘాను ఏర్పాటు చేసి గంజాయి, డ్రగ్స్ నిర్మూలించాలని జనసేన నేత గురాన అయ్యలు …జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కి విజ్ఞప్తి చేశారు…జిల్లాను డ్రగ్స్, గంజాయి రహిత జిల్లా గా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ నేటి యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. అత్యంత ప్రమాదకరమైన మత్తు పదార్ధాలను సేవించడంతో సకల అనర్ధాలకు కారణమవుతు న్నారన్నారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ దందా విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బడిపిల్లల నుంచి వర్సిటీ విద్యార్థులు, రోజు కూలీ నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వ్యాపారుల వరకు ఈ మత్తు మహమ్మారికి బానిసలౌతున్నారని తెలిపారు.గంజాయి, డ్రగ్స్ నివారణకు కృషి చేయాలని కోరారు.
గంజాయి అక్రమ రవాణా నియంత్రకు దాడులు ముమ్మరం చేయాలని, ఆకస్మికంగా లాడ్జిలు, వాహనాలు తనిఖీ చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి, తాత్కాలికంగా నివాసం ఏర్పరుచుకునే వ్యాపారులపై ప్రత్యేక దష్టి పెట్టాలని, వారు చేసే వ్యాపారులు, తీసుకు వస్తున్న సరుకులు, వాటిని స్టోర్ చేసే గోడౌన్ లను తనిఖీ చేయాలని కోరారు. లంకా పట్టణం, జోన్నగుడ్డి, వైఎస్‌ఆర్ నగర్, దాసన్నపేట, గాజులరేగ, పూలబాగ్ కాలనీ ప్రాంతాల్లో యువతను చైతన్యపర్చి కౌన్సిలింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పి. రవీంద్ర, ఎంటి రాజేష్ , ఎమ్ . పవన్ కుమార్ , పృధ్వీ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. (Story : జిల్లాను డ్రగ్స్, గంజాయి రహిత జిల్లా గా మార్చేందుకు చర్యలు తీసుకోండి)