చట్టంలోని ప్రమాణాలకు అనుగుణంగా స్కాన్ సెంటర్లు నడపాలి
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలో అన్ని స్కాన్ సెంటర్లు తప్పనిసరిగా చట్టంలోని ప్రమాణాలకు అనుగుణంగా ఉండేటట్లు నడుపుకోవాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ స్థాయిలో బిసి అండ్ పి ఎన్ డి వై అడ్వైజరీ కమిటీ సమావేశమును నిర్వహించారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ పట్టణంలోని స్కాన్ సెంటర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా లింగ నిర్ధారణ చేయరాదని వారు హెచ్చరించడం జరిగింది అని తెలిపారు. స్కాన్ సెంటర్లను క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఇందులో వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ, పోలీసు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాలని తెలిపారు. అనుమానిత సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని తెలిపారు. చట్టంపై ప్రజల్లో, స్థానిక సంస్థలు, విద్యార్థులు మొదలగు వారిని పూర్తిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ సెల్వియా సల్మాన్, జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ బాబా ఫక్రుద్దీన్, గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవి, చిన్న పిల్లల డాక్టర్ వెంకటేశ్వర్లు డిబిసి ఆఫీసర్ డాక్టర్ అనురాధ వైద్యాధికారి డాక్టర్ సురేష్ నాయక్ 2 టౌన్ సిఐ రెడ్డప్ప రెడ్ క్రాస్ సొసైటీ సత్య నిర్ధారన్, రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, హెల్త్ ఎడ్యుకేటర్ సుశీలమ్మ, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.(Story:చట్టంలోని ప్రమాణాలకు అనుగుణంగా స్కాన్ సెంటర్లు నడపాలి )