ఆ దిష్టిబొమ్మ సీఎం జగన్‌దేనా?
అమరావతి: వైసీపీ ఎమ్మెల్యేలందరూ మంత్రిపదవులు కోరుకున్నారు. అందరికీ పదవులు ఇవ్వడం ఎలాగో పాపం సీఎం జగన్‌కు తెలియదు. అందుకే ఓ 25 మందికి మాత్రం మంత్రిపదవులు ఇవ్వగలిగారు. మిగతా నూటపాతికమంది అలకబూనారు. రాజీనామాలు చేస్తామని, అది చేస్తామని, ఇది చేస్తామని ఇష్టానుసారం బెదిరించారు. తమ వెంట ఉన్న కుర్రాళ్లతో దిష్టిబొమ్మలు తగలబెట్టించారు. నిజానికి తగలబెట్టిన దిష్టిబొమ్మలు ఎవరివని మీడియా అడిగితే ఏ ఒక్కరూ చెప్పలేదు. గడ్డికి ఓ గుడ్డపాత కట్టి తగలబెట్టామని చెప్పారు. ఆ దిష్టిబొమ్మకు పేరూలేదు ఊరూలేదు. జగన్ దిష్టిబొమ్మను తగలబెట్టారేమోనని మీడియా గట్టిగా అడిగింది.
అయ్యబాబోయ్! జగన్ దిష్టిబొమ్మను తగలబెట్టడమే! అంటూ నోళ్లు వెళ్లబెట్టారు. అలాంటి తప్పులు మేం చేయబోమని చెంపలు వాయించుకున్నారు. మరి…ఆ దిష్టిబొమ్మ ఎవరిదని అడిగితే చెప్పలేకపోయారు. …ఇదీ కథ!
మరి దేనికీ నిరసనలు? మీ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి నిరసన తెలిపారు. అంతవరకు బాగానే వుంది. 125 మంది నాయకుల అనుచరులంతా రోడ్డెక్కారు. అంటే 125 మందికీ పదవులిస్తే ఓకేనా?
అలా కుదరదు! ఒక్క మా నాయకుడికి మాత్రమే పదవి ఇవ్వాలి.
మరి మిగతా వైసీపీ ఎమ్యెల్యేలంతా వేస్టుగాళ్లా? వారిని జనం గెలిపించలేదా? మీ నాయకుడి గొప్పేంటి?
మా నాయకుడి గొప్పేంటంటే…అందరికన్నా నాలుగు మర్డర్లు ఎక్కువ చేశాడు కాబట్టి! అలాగే నాలుగు రాళ్లు ఎక్కువ వెనుకేసుకున్నాడు కాబట్టి!
…ఇదీ అసమ్మతి నేతల అనుచరుల తీరు!
నిజానికి వైసీపీ కార్యకర్తల్లో 95 శాతం మంది జగన్ మంత్రివర్గ విస్తరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే రెడ్డి, కమ్మ వంటి పెద్ద కులాలను పక్కనబెట్టి, గరిష్టస్థాయిలో బీసీ, ఎస్సీలకు తొలిసారిగా ఎక్కువ మంత్రిపదవులు ఇచ్చారు. గత ఏ ప్రభుత్వ హయాంలోనూ అది జరగలేదు. ఎటొచ్చీ అసమ్మతివాదుల జాతర తప్ప ఇంకేమీ కాదు. పాత మంత్రుల్లో 11 మందిని కొనసాగించారు. నిజానికి అది చాలా ఎక్కువ. మిగిలిన 14 మంది కూడా తమను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇక అందర్నీ కొనసాగిస్తే, విస్తరణ ఎందుకు? ఏదో…సామాజిక వర్గాల కూర్పులో కొందరు ఎగిరిపోయారు. అదరికీ న్యాయం చేయాలంటే ఏ సీఎంకూ సాధ్యం కాదు.
ఓ మాజీ మంత్రి ఏకంగా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. చేశారు కూడా! రాజీనామా చేసి టీడీపీలో చేరుతారా? మంత్రిపదవి వుంటేనే ఆ వ్యక్తి ప్రజాప్రతినిధిగా వుంటారా? ఇన్నాళ్లూ పదవిని వెలగబెట్టిన ఆ వ్యక్తిని టీడీపీ కోవర్టు అనుకోవాలా? అలకబూనిన ఇంకో మాజీ మంత్రిని బుజ్జగించారు. తప్పని పరిస్థితుల్లో బుజ్జగింపులు జరిగినట్లు చెపుతున్నారు. ఎలాగైతేనేం…దాదాపు అంతా చల్లబడ్డారు. ఇంకో ఎమ్మెల్యే మంత్రిపదవి ఆశించారు. కానీ దక్కలేదు. ఆ బాధ తట్టుకోలేక కంటతడిపెట్టారు. కానీ జగన్ నిర్ణయానికి కట్టుబడి వున్నానని ప్రకటించారు. అదీ స్పోర్టివ్‌నెస్ అంటే! జగన్ కూడా అలాంటి వారిని ప్రోత్సహించాలి. అలిగేవారిని, బెదిరించేవాళ్లను పక్కనబెట్టేయాలి.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మంచి పథకాలతో ప్రజల మెప్పుపొందారు. కానీ అంతలోనే కొన్ని నిర్ణయాలతో రేటింగ్ తగ్గింది. జగన్ పట్ల ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. అలాగని, జనం టీడీపీ వైపు మొగ్గుచూపడం లేదు. ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. సరైన ప్రత్యామ్నాయం ఇంతవరకు దొరకలేదు. ఏతావాతా చెప్పేదేమిటంటే, చంద్రబాబును కూడా జనం నమ్మే పరిస్థితి లేదు కాబట్టి, జగన్ గారు కాస్త మార్పుచెంది, ఇదివరకటి లాగానే పథకాలతో ప్రజల మన్ననలు పొందాలి. జనంపై పడిన ధరల భారాన్ని తగ్గించాలి. (Story: ఆ దిష్టిబొమ్మ సీఎం జగన్‌దేనా?)
See Also:
ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం హైలైట్స్!
బాలినేనికి మంత్రిపదవి దక్కకపోవడానికి కారణాలివేనా?
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు వీరే! (Full Details)
మీడియాపై మంత్రి పేర్ని నాని ఉద్వేగపూరిత వ్యాఖ్యలు
మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
రామ్‌గోపాల్‌వర్మకు ధియేటర్ల షాక్!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!