ఎంత దారుణం : శవంతో సెక్స్!
వికారాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌లో కలకలం రేపిన మైనర్ బాలిక హత్య, అత్యాచారం కేసును పోలీసులు ఎంతో తెలివిగా, చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ప్రేమికుడే నిందితుడు మహేందర్ అని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం…‘‘హతురాలు మైనర్ బాలిక. ఆమెతో మహేందర్‌కు ఏడాదికాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ ప్రేమ వ్యవహారం హత్యకు రెండు రోజుల ముందు మృతురాలి చెల్లెలకు తెలిసింది..మృతురాలి చెల్లి ఈ విషయం ఇంట్లో చెప్పింది. దీంతో తల్లి మందలించింది.. ఇక బయట కలుసు కోవడం కుదరదని భావించి రోజూ ఫోన్ కాల్ చేసి మాట్లాడుకున్నారు. ఇద్దరం బయట కలుద్దాం అని మాట్లాడుకున్నారు. రెండు రోజుల తర్వాత మార్చి 28వ తేదీన ఉదయం మూడు నాలుగు గంటల ప్రాంతంలో ఆ అమ్మాయి బయటకు వచ్చింది. మృతురాలిని తనతో ఫిజికల్‌గా కలవాలంటూ మహేందర్ బలవంత పెట్టాడు. అయితే ఆమె వ్యతిరేకించింది. పైగా ఆ బాలిక గట్టిగా ప్రతిఘటించింది..దీంతో మహేందర్‌కు, ఆమెకు మధ్య పెనుగులాట జరిగింది. ఈ పెనుగులాటలో బాలికను తోయడంతో ఆమె తల పక్కనే ఉన్న చెట్టుకు బలంగా తాకింది. దీంతో బాలిక మృతి చెందింది. ఆమె చనిపోయిందన్న విషయం మహేందర్‌కు తెలియదు. అది గమనించకుండా మహేందర్ ఆమెపై హత్యాచారం చేసాడు. అత్యాచారం అనంతరం బాలికను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు’’ అని ఎస్పీ వెల్లడించారు. మహేందర్ ఈ నేరానికి పాల్పడినట్లు, హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఎస్పీ వెల్లడించారు. 28వ తేదీ ఉదయం అంగడి చిట్టెంపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం, హత్య చేసినట్టు పిర్యాదు అందగానే, తాము హుటాహుటిన అక్కడకు చేరుకొని దర్యాప్తు కోసం టీమ్స్‌ను ఫామ్ చేశామని తెలిపారు. కేవలం 48 గంటల్లో నిందితుడిని గుర్తించామన్నారు. నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. (Story: ఎంత దారుణం : శవంతో సెక్స్!)
See Also: క్యాబినెట్ విస్తరణ ముహూర్తం కుదిరింది!
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
రాజమౌళి కొత్త సినిమా అప్డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)