నిరుద్యోగులకు తీపికబురు!
ఏపీలో జూన్‌లోనే టీచర్ ఎటిజిబిలిటీ టెస్ట్ 2022
టెట్ నిర్వహణకు ఏపీ అధికారుల కసరత్తు
అమరావతి: తెలంగాణ రాష్ట్రంలో టిఎస్‌టెట్‌కు సంబంధించి ఇటీవలనే ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు శీఘ్రతరం చేసింది. ఈ మేరకు సిలబస్‌ను కూడా ఖరారు చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీటెట్ 2022)ను జూన్‌లో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. ఈ ఏడాది టెట్ నిర్వహణ అనంతరం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా వెల్లడిరచారు. రాష్ట్రంలో సుమారు 6,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. సబ్జెక్ట్ టీచర్లతో బోధన ఉండేలా చూస్తున్నాం. దీనికోసం 35-40 వేల స్కూల్ అసిస్టెంట్లు అవసరం ఉంది. ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పించి.. అనంతరం ఏర్పడిన ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు. ఎంఈవో-2 పోస్టుల ఏర్పాటు కోసం ఏ ఉపాధ్యాయ పోస్టు రద్దు చేయమని.. ఓ ఒక్క పాఠశాలను మూసేసే ఆలోచన లేదన్నారు. మూడు దశల్లో 30-40 వేల అదనపు తరగతి గదులను నిర్మిస్తామని తెలిపారు. వాస్తవానికి ఏపీటెట్‌ను ప్రతి సంవత్సరం నిర్వహించాలన్న నిబంధన వుంది. కానీ ప్రభుత్వం అలా చేయడం లేదు. కేవలం ఖాళీలను గుర్తించిన తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సమయంలోనే దీన్ని నిర్వహిస్తున్నారు. గడిచిన నాలుగేళ్లుగా ఏపీ టెట్ లేనేలేదు. అంటే 2018 తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు టెట్ నిర్వహించలేదు. అప్పట్లో డీఎస్సీతోపాటు టెట్‌ను కూడా నిర్వహించారు. 2018 నుంచి ఇప్పటి వరకు వేల మంది విద్యార్ధులు బీఈడీ, డీఈడీ పూర్తి చేశారు. కాగా ఏపీలో ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
తెలంగాణలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో టెట్ నిర్వహణకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 26వ తేదీన ప్రారంభమైంది. జూన్ 12న టెట్ పరీక్ష జరగనుంది. అనంతరం ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇప్పటికే సిలబస్‌ను కూడా ఖరారు చేశారు. పాత సిలబస్‌నే ఈసారి కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు టిఎస్ వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపర్చింది. (Story: నిరుద్యోగులకు తీపికబురు!)
See Also: ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)
తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్ల తుఫాన్!