డ్రెయిన్లు నిర్మాణంలో తాత్కాలిక మార్కాన్ని కల్పించండి
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : డ్రెయిన్ల నిర్మాణం, మరమ్మత్తుల సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాత్కాలిక మార్గ సౌకర్యాన్ని కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశించారు. స్థానిక ఈఎస్‌ఐ హాస్పిటల్, గుణదల తదితర ప్రాంతాల్లో కమిషనర్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఎస్‌ఐ హాస్పిటల్‌కి వెళ్లేందుకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాత్కాలిక దారిని ఏర్పాటు చేసి, త్వరతి గతిన అక్కడి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రధాన ప్రాంతాల్లో ప్రజలకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా తాత్కాలిక దారిని ఉపయోగించే విదంగా చర్యలు తీసుకుని డ్రెయిన్లు నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో సుపరిండెంటింగ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఇంచార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. (Story : డ్రెయిన్లు నిర్మాణంలో తాత్కాలిక మార్కాన్ని కల్పించండి)