చింతూరు అటవీ రేంజిలో పెద్దపులి సంచారం
రెండు పశువులపై దాడి
ఒక పశువుకి మృతి
రెండో పశువుకు తీవ్ర గాయాలు
విశాలాంధ్ర/చింతూరు: చింతూరు అటవీ రేంజ్ పరిధిలోని గుల్లేటివాడ గ్రామంలో వంజం సుబ్బయ్య అనే గిరిజన రైతుకు చెందిన రెండు పశువులపై పెద్దపులి దాడి చేసింది. ఒక పశువు మృతి చెందింది. మరో పశువుకు తీవ్రంగా గాయపడింది. గత మూడు రోజుల క్రితం ఏలూరు జిల్లా సరిహద్దులు దాటి గోదావరి నదిలో ఈదుకొని పెద్దపులి పోలవరం జిల్లాలోని పాపికొండలు అభయారణ్యంలో ప్రవేశించిందని తెలిసింది. ఆచంట నుండి విఆర్ పురం రేంజిలో తిరిగి మంగళవారం చింతూరు అటవీరేంజ్ పరిధిలో ప్రవేశించింది. మంగళవారం రాత్రి టేకులూరు ప్రాంతంలో ఉన్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. బుధవారం ఉదయం చదలవాడ అటవీ ప్రాంతంలో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. చింతూరు అటవీ రేంజ్ పరిధిలోపెద్దపులి సంచరించటంతో గిరిజనులు భయం గుప్పెట్లో గురవుతున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో అని వాపోతున్నారు. (Story: చింతూరు అటవీ రేంజిలో పెద్దపులి సంచారం)

Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!