Home అవీఇవీ! ఆ చేప కన్పిస్తే…సునామీనే!

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

0
Rare Deep Sea Oarfish
Rare Deep Sea Oarfish

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

టోక్యో: సముద్రంలో ‘ఓర్‌ ఫిష్‌’ అనే ఒక చేప కనబడితే చాలు…జపనీయులు (జపాన్‌ ప్రజలు) భయంతో వణికిపోతారు. అంతగా భయపడటానికి కారణం ఏమిటంటే, అరేబియన్‌ సముద్రలోతుల్లో అత్యంత అరుదుగా కన్పించే ‘ఓర్‌ ఫిష్‌’ అనే చేప కన్పిస్తే..కచ్చితంగా అతిపెద్ద భూకంపాలు, లేదా సునామీలు వస్తాయన్నది వారి నమ్మకం. నిజానికి ఇది నమ్మకం కాదు…అదొక లెఖ్క అని శాస్త్రవేత్తలు సైతం అంటూ వుంటారు. ఓర్‌ ఫిష్‌ కన్పించిందంటే..సముద్రంలో ఏదో ఒక ఉప్పెనకు సంకేతమని వారంటున్నారు. ఈ చేప కన్పించిన ప్రతిసారీ కచ్చితంగా చిన్నదో, పెద్దదో ఏదో ఒక విపత్తు సంభవిస్తూనే వుందని జపాన్‌ ప్రజలు చెపుతున్నారు. జపాన్‌ జానపద కథల ప్రకారం, సముద్రం లోతుల్లో మాత్రమే ఉండే ఓర్‌ ఫిష్‌ లాంటి చేపలు కాస్త పైకి వచ్చి కన్పించాయంటే…ఆ సమయంలో భూకంపం, లేదా సునామీ సంభవించడానికి ఒక హెచ్చరిక. 99% ఇది రుజువైనందున, జపాన్‌ ప్రజలు దీన్ని గాఢంగా విశ్వసిస్తూ వుంటారు. ఇదొక చెడు సంకేతంగానే వారంటారు. ఇంతకీ ఇప్పటికిప్పుడు ఈ అంశం ఎందుకు చర్చకు వచ్చిందంటే…డైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ వాంగ్‌ చెంగ్‌`రూ అరేబియా సముద్రంలోని తైవాన్ ప‌రిధిలో గ‌ల రూఫాంగ్‌ తీరం ప్రాంతంలో డైవింగ్‌ చేస్తూ తన కెమెరాతో ‘ఓర్‌ ఫిష్‌’ సంచరిస్తున్న దృశ్యాన్ని చిత్రీకరించాడు. ఈ ఫుటేజీని బయటపెట్టాడు. ఇది చాలావరకు అంతర్జాతీయ మీడియా, యూట్యూబ్‌, వెబ్‌సైట్లలో ప్రసారమైంది. ఓర్‌ ఫిష్‌ కన్పించినంత మాత్రాన భూకంపాలు వస్తాయని తాను నమ్మడం లేదని వాంగ్‌ చెంగ్‌ రూ స్పష్టంగా చెపుతున్నప్పటికీ, జపాన్‌ ప్రజలు మాత్రం లోకల్‌ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఈ వీడియోను చూసి వణుకుతున్నారు. అంతేకాదు..సముద్రతీర ప్రాంత ప్రజల్లో కొందరు తుఫాను జాగ్రత్త చర్యలు సైతం తీసుకుంటున్నారు. ఓర్‌ ఫిష్‌ సహజంగా సముద్ర జలాల ఉపరితలం నుంచి 3000 అడుగుల లోతున సంచరిస్తుంది. అయితే అదిప్పుడు కేవలం 50 అడుగుల లోతులో అగుపించింది. అరేబియన్‌ సముద్రంలో కన్పించే ఇలాంటి అరుదైన జలచరాలు హిందూ మహాసముద్రంలో కూడా కన్పిస్తూ వుంటాయి. కాకపోతే హిందూ మహాసముద్రం ఆవరించిన ప్రాంతంలో ఇలాంటి నమ్మకాలంటూ ఏమీ లేవు. ఈ విషయంలో శాస్త్రవేత్తలో భిన్నాభిప్రాయాలు వున్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం ఇలాంటి మూఢనమ్మకాలను కొట్టివేస్తున్నారు. ఇంకొందరు మాత్రం నమ్మకంగా కాకుండా, ఇదొక సంకేతంగా భావించవచ్చని అంటున్నారు. 2019 ఫిబ్రవరిలో ఓర్‌ ఫిష్‌ ఇలాగే కన్పించింది. ఆ సమయంలో జపాన్‌ను సునామీ తుడిచిపెట్టేసింది. గతంలో పలు సందర్భాల్లో ఓర్‌ ఫిష్‌ కన్పించినప్పుడు కూడా తుపాన్లు, భూకంపాలు సంభవించాయి. ప్రతియేటా జపాన్‌లో జూన్‌ 1 నుంచి జులై 31 వరకు తీరప్రాంతంలో చేపల వేటను నిషేధిస్తూ వుంటారు. అరుదైన చేపల పరిరక్షణే ధ్యేయంగా ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. (Story: ఆ చేప కన్పిస్తే…సునామీనే!)

News on YouTube

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version