మావోయిస్టు డంప్ స్వాధీనం
గడ్చిరోలి అటవీ ప్రాంతంలో కలకలం
న్యూస్‌తెలుగు/చింతూరు: భారీ ఎత్తున మావోయిస్టుల ఆయుధ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర రాష్ట్రలోని గడ్చరోలి జిల్లా పోస్టే వాంగేటూరి పరిధిలోని మౌజ మచవంచ అడవి ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను దాచిపెట్టారని గడ్చిరోలి పోలీసు దళానికి మంగళవారం ఉదయం రహస్య సమాచారం అందింది. రహస్య సమాచారం ఆధారంగా గడ్చిరోలి పోలీస్ సూపర్డెంట్ ఎం రమేష్ మార్గదర్శకత్వంలో సదరు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టేందుకు జిల్లా కేంద్రం నుండి నాలుగుబృందాలు, బి డి డి యస్ నుండి ఒక బృందం తో కూడిన ఒక ప్రత్యేక ఆపరేషన్ బృందాన్ని పంపించారు. ప్రత్యేక బృందాలతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీచేయగా ఒకచోట డంపులభ్యమైంది. ఆ డంపులో 12 క్లైమూర్ మైన్స్, 12 బోర్ రైఫిల్, సింగిల్ షాట్ రైఫిళ్ళు 3, ఒక ఎయిర్ గన్, ఐ ఈ డి పేలుడు పదార్థం, జెయింట్ క్లైమూర్ పేలుడు పదార్థం, ఒక వైర్లెస్ సెట్, లోయర్ హ్యాండ్ గార్డ్,100 ట్వేన్ బాంబులు,5 జతల మావోయిస్టు యూనిఫామ్ లను సి 60, బి డిడి ఎస్ బృందాలు సంఘటనా స్థలాల నుండి స్వాధీనం చేసుకున్నాయి. ఉన్నతాధికారుల మార్గదర్శకంలో ఆ సామాగ్రిని అక్కడే ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) కార్తీక్ మధీర, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గోకుల్ రాజ్ జి., అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) హర్షవర్ధన్ బి. జె., డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) సునీల్ ఉయికేల పర్యవేక్షణలో, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్, గడ్చిరోలి సిహెచ్ ఇంట్ సెల్ మరియు బిడిడిఎస్ టీమ్ సిబ్బంది ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందిని గడ్చిరోలి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం. రమేష్ ప్రశంసించారు. (Story: మావోయిస్టు డంప్ స్వాధీనం)

Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!