ఓటీయస్ దరఖాస్తుల స్వీకరణ తాత్కాలికంగా నిలిపివేత
విశాలాంధ్ర/చింతూరు: ఇటీవల ఆర్ అండ్ ఆర్ 3వ లిస్ట్ను చింతూరు ఐటీడీఏ పరిధిలోని వీఆర్ పురం, కూనవరం, చింతూరు మండలాల్లో విడుదల చేయడం జరిగిందని ప్రాజెక్ట్ అధికారి తెలిపారు. ఆర్ అండ్ ఆర్ 3వ లిస్ట్‌కు సంబంధించి ఓ టి ఎస్ (వన్ టైం సెటిల్మెంట్ ) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గత రెండు రోజులుగా సంబంధిత మండలాల్లో కొనసాగుతోందని తెలిపారు. అయితే, ప్రస్తుతం అర్నాబ్ తుపాను ప్రభావం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని 28.10.2026 నుండి 29.10.2026 వరకు రెండు రోజుల పాటు ఓటిఎస్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారి తెలిపారు. తుపాను ప్రభావం తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన అనంతరం 30.10.2026 నుండి ఓ టీ యస్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. సంబంధిత తేదీపై ఏవైనా మార్పులు ఉంటే అధికారికంగా తెలియజేయబడతాయన్నారు. కావున వీఆర్ పురం, కూనవరం, చింతూరు మండలాలకు చెందిన ఆర్ అండ్ ఆర్ 3వ లిస్ట్ లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి, తుపాను పరిస్థితుల దృష్ట్యా అధికారులకు సహకరించాలని ప్రాజెక్ట్ అధికారి కోరారు. (Story: ఓటీయస్ దరఖాస్తుల స్వీకరణ తాత్కాలికంగా నిలిపివేత)
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!
