Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పోలీసు ఉన్నతాధికారులు

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పోలీసు ఉన్నతాధికారులు

0

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పోలీసు ఉన్నతాధికారులు

న్యూస్‌తెలుగు/చింతూరు: అర్నాబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో పోలవరం జిల్లా పరిధిలోని చింతూరు సబ్‌ డివిజన్‌లో గల సొకులేరు వ్యూ పాయింట్, వాగు పరిసర ప్రాంతాలను పోలీసు ఉన్నతాధికారులు సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ పర్యటనలో పోలవరం జిల్లా ఓఎస్డి ఎం. జవాలి ఆల్ఫోన్స్,, చింతూరు సబ్‌ డివిజన్ డీ యస్పి శ్రీమతి కె. ఉదయ పావని, చింతూరు సీఐ సీహెచ్. గోపాలకృష్ణ, మోతుగూడెం ఎస్‌ఐ అబ్దుల్ నాసిర్ హుస్సేన్ పాల్గొన్నారు. తుఫాన్ కారణంగా వాగులు, జలాశయాలు, పర్యాటక ప్రాంతాల వద్ద నెలకొన్న పరిస్థితులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు మరియు పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. ముఖ్యంగా వాగులు, నీటి ప్రవాహాల వద్ద భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని పోలీసు సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశించారు. (Story: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పోలీసు ఉన్నతాధికారులు)

Top Stories You Can See

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version