వంట గ్యాస్ కు అదనపు చార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం
తాసిల్దారు సురేష్ నాయక్
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ పట్టణం మరియు మండల పరిధిలోని అన్ని వంట గ్యాస్ ఏజెన్సీ లతో సోమవారం వినుకొండ తాసిల్దార్ సురేష్ నాయక్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ. గ్యాస్ అసలు ధర కంటే, ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయకూడదని ఏజెన్సీలకు సూచించారు. అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో ఏజెన్సీలకు చెప్పాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అదనపు చార్జీలు వసూలు చేసినట్లు తిరిగి తమ దృష్టికి వస్తే తగు చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ సురేష్ నాయక్ ఏజెన్సీలను హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్ ఐ . శ్రీహరి, రెవెన్యూ సిబ్బంది, గ్యాస్ ఏజెన్సీలు పాల్గొన్నారు.(Story : వంట గ్యాస్ కు అదనపు చార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం)