DBCWO జిల్లా అధికారి బీరం సుబ్బారెడ్డి
సస్పెండ్ చేయాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : DBCWO జిల్లా అధికారి బీరం సుబ్బారెడ్డి సస్పెండ్ చేయాలని PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు K పవన్ కుమార్ డిమాండ్ చేశారు. PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి PDSU ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ మాట్లాడుతూ బీరం సుబ్బారెడ్డి HWO కొండనాగుల హాస్టల్ నాగర్ కర్నూల్ జిల్లాలో 2016 సంవత్సరం ఉద్యోగంలో ఉన్నప్పుడు అక్కడ హాస్టల్ లో ఉన్న 150 మంది విద్యార్థులకు అన్యాయం చేశాడని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేస్ పెండింగ్లో ఉండగా ఉన్నత అధికారులకు మభ్యపెట్టి, డబ్బులు ఇచ్చి ఈ ఆఫీసర్ వనపర్తి జిల్లాకు ABCWO గా బదిలీదార నియామకమై DBCWO ఇన్చార్జిగా వనపర్తి జిల్లాలో 15 హాస్టళ్లకు ,ట్రైబల్ వెల్ఫేర్ ఇంచార్జ్ జిల్లా అధికారిగా 5 ఎస్టి హాస్టల్స్ కి నియమించబడ్డాడు. ఇలాంటి ఆఫీసర్ విద్యార్థిని, విద్యార్థులకు ఎలా న్యాయం చేయగలుగుతాడని PDSU గా విమర్శించారు. ఈ సుబ్బారెడ్డి 01/01/2023 నుండి ఎంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగం నియమించినారు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఏమైనా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినారా ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఏ ప్రాతిపదికన ఔట్సోర్సింగ్ ఎంప్లాయిమెంట్ సెలెక్ట్ చేశారు. ఔట్సోర్సింగ్ వారి నుండి ఒక్కొక్కరి దగ్గర వేల రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాలని PDSU గా డిమాండ్ చేస్తున్నాం. ఈ అధికారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో PDSU నాయకులు తయానా, ప్రవీణ్, రాజు,గణేష్, రాజశేఖర్, రాఘవేందర్ పాల్గొన్నారు. (Story : DBCWO జిల్లా అధికారి బీరం సుబ్బారెడ్డి సస్పెండ్ చేయాలి)