అపన్నులకు కొంగుబంగారంగా సీఎం సహాయనిధి
లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన జీవీ
న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఆర్‌ఎఫ్ ని ఆపన్నుల పాలిట కొంగుబంగారంగా మార్చారని అన్నారు చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అడిగిందే తడవుగా అవసరంలో ప్రతిఒక్కరికీ పారదర్శకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందుతూ ఉండడమే అందుకు నిదర్శనమన్నారు. సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఇద్దరికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్ధిక సాయం చెక్కులను ఆయన అందజేశారు. బొల్లాపల్లి మండలం మేళ్లవాగుకు చెందిన జొన్నలగడ్డ పేరమ్మకు రూ.85 వేలు, ఈపూరు మండలం వనికుంట వాసి బచ్చనబోయిన వెంకటేశ్వర్లుకు రూ.50 వేల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలు జీవీ ఆంజనేయులు, సీఎం నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొని, ఆపత్కాలంలో వారికి అండగా నిలుస్తోందన్నారు. కొత్త సంవత్సరం తొలి రోజు 1,600 మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.24 కోట్లు విడుదల చేసే ఫైల్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేశారని. 6 నెలల్లోనే డిసెంబర్ 31 వరకు 7, 523 మందికి రూ.100 కోట్ల మేరకు సాయం చేశారని గుర్తు చేశారు. (Story : అపన్నులకు కొంగుబంగారంగా సీఎం సహాయనిధి)