రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి
ఎస్సై విజయభాస్కర్
న్యూస్ తెలుగు/ హుస్నాబాద్/ అక్కన్నపేట ప్రతినిధి( ఉడుత సుమలత) : ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని అక్కన్నపేట ఎస్సై విజయభాస్కర్ సూచించారు రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో రోడ్డు భద్రత మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా సీపీ డాక్టర్ అనురాధ ఆదేశాల మేరకు సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఎస్సై విజయభాస్కర్ మాట్లాడుతూ హెల్మెట్‌లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీటు బెల్టు ఉపయోగించకపోవడం, మొబైల్ ఫోన వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. ఈ విషయాలను తమతో పాటు ఇతరులకు కూడా అర్థమయ్యేలా చెప్పాలని ఎస్సై సూచించారు. (Story : రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి)