పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి
ఆగస్టు27,28 తేదీన జరిగే ఆందోళనలను జయప్రదం చేయండి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల (రాజ గారి బంగ్లా) మందు ప్రెస్ మీట్ లో తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వెంకటయ్య మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టపెడున్నది.కేంద్ర ప్రభుత్వం 2006 అటవి హక్కుల చట్టానికి తూట్లు పొడవడానికి 2022 అటవీ సంరక్షణ నియమాల పేరుతో అడవి నుంచి ఆదివాసులకు హక్కులు లేకుండా చేస్తున్నది. కార్పొరేట్ కంపెనీలకు అడవులను అమ్మి ఖనిజ సంపదలను దోచుకోవడానికి ఆదివాసులను అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారు. వ్యవసాయాన్ని బడా కార్పోరేట్స్ విత్తన కంపెనీలకు విత్తన పరిశోధన సంస్థ నుంచి నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కార్పొరేట్ సంస్థలు అమెజాన్, సింజంట, బేయర్ కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థ ద్వారా నిధులు ఇచ్చేందుకు నిర్ణయించారు. కార్పొరేట్ విత్తన కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం 5 శాతం పన్నులు కూడా మినహాయించింది. విత్తన సంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటేనే రైతాంగానికి నాణ్యమైన విత్తనాల అందుతాయి. కార్పొరేట్ కంపెనీలు రైతాంగాన్ని తీవ్రమైన దోపిడీ చేస్తాయి. విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోమని రైతులకు హామీ ఇచ్చారు. కానీ రైతులకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఎరువుల సబ్సిడీకి కోతలు పెట్టారు. ఇలా ఎన్నో రైతాంగ వ్యతిరేక నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది.గతంలో 2021 అక్టోబర్ లో మూడు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేస్తూ కనీస మద్దతు ధరలకు చట్టం చేస్తానని,దేశ రైతాంగానికి మొత్తం అప్పులను మాఫీ చేయాలనే డిమాండ్లతో ఆరోజు రైతాంగానికి రాతపూర్వకమైన హామీలను అమలు చేస్తానని చెప్పి నేటికీ అమలు చేయలేదు.
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయనికి అతి తక్కువగా బడ్జెట్ ను కేటాయించినందున దీనిని సవరించి బడ్జెట్లో 25శాతాన్ని పెంచి,WTO నుండి భారతదేశం బయటికి రావాలని, రైతు కూలీలకు 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ తో పాటు వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు, వరి కోత మిషన్లు, వ్యవసాయ పరికరాలు కొన్న వాటికి కేంద్రం పన్నులు విధించరాదు.
రాష్ట్రంలో 2023 డిసెంబర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బ్యాంకులలో పంట రుణాలు రెండు లక్షల మాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీ పాటు రైతు భరోసా, కౌలు రైతులకు రైతు భరోసాను అమలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రైతు భరోసా (రైతుబంధు) నేటి వరకు ఇవ్వలేదు ధరణి పోర్టల్ రద్దు చేసి భూమి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పింది. భూ సమస్యలు 20 లక్షల పైగా భూమి సమస్యలు పరిష్కారం కానందున రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో రైతాంగం చనిపోతున్నారు.గత ప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామంటే 20 లక్షల ఎకరాలకు దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ కేవలం 4 లక్షల ఎకరాలకి హక్కు పత్రాలు ఇచ్చి, గత ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే పోడు రైతులకు
హక్కు పత్రాలు ఇస్తామని చెప్పింది. రుణమాఫీ 2018 డిసెంబర్ తర్వాత తీసుకున్న వారికే రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన వెంబడే మాట మార్చి కటాఫ్ డేట్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేయడంతో పాటు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలలో రైతాంగానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. రైతాంగా సమస్యలు పరిష్కారం కానందున వాటి పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మండలాల,జిల్లాల కార్యాలయాల ఎదుట అధిక సంఖ్యలో రైతాంగం వచ్చి ఈనెల 27, 28 తేదీలలో జరిగే నిరసనలో భాగం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యక్రమంలో తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వెంకటయ్య, ప్రజాకవి జనజ్వాల,రాజా రాంప్రకాష్, రైతాంగ సమితి జిల్లా నాయకులు చింతకుంట బాలయ్య,C కురుమన్న చెవ్వ బాలయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి)