ప్రారంభమైన ప్రాపర్టీ బిల్డింగ్ మెటీరియల్ ఎక్సపో
న్యూస్‌తెలుగు/విజయనగరం : ఆదివారం నుండి మూడు రోజులపాటు రింగ్ రోడ్డు లీ ప్యారడైజ్ కన్వెన్షన్ లో క్రెడాయ్ విజయనగరం చాప్టర్ 5వ ప్రాపర్టీ బిల్డింగ్ మెటీరియల్ ఎక్స్ పో కార్యక్రమాన్ని. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా క్రెడాయ్ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల సొంత ఇల్లు కొనుగోలు చేసే వారికి పూర్తిస్థాయి సమాచారం ఉంటుందన్నారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి ఇంటికి సంబంధించిన ప్రతి విషయాలపై అవగాహన కలుగుతుందన్నారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.సుభాష్ చంద్రబోస్, జిల్లా చైర్మన్ వి పార్థసారథి మాట్లాడుతూగతానికి భిన్నంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న 5వ ప్రాపర్టీ బిల్డింగ్ మెటీరియల్ ఎక్సపోకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించిందన్నారు. ప్లాట్స్,విల్లాస్, హోమ్ లోన్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్, బిల్డింగ్ మెటీరియల్,ఫర్నిచర్, ఇంటీరియర్స్,హోం అప్ప్లైయెన్సెస్,సోలార్,జనరేటర్స్ వంటి నిర్మాణాలకు సంబంధించిన డోర్స్, యుఐవిఈ విండోస్, హ్యాండ్ వాష్, సానిటరీ, పివిసి పైప్స్, టైల్స్,ఫ్లోర్ మాట్స్ వంటి నిర్మాణ సామాగ్రికి సంబంధించి సుమారు 100 స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ సిహెచ్ సూర్యనారాయణ రాజు, సెక్రెటరీ కిలాని రాజశేఖర్, కోశాధికారి జిబి అనిల్ కుమార్,జిల్లా పూర్వ ఛైర్మెన్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రారంభమైన ప్రాపర్టీ బిల్డింగ్ మెటీరియల్ ఎక్సపో)