విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి మహిళా ఉపాద్యాయుల పాత్ర గణనీయమైనది
న్యూస్ తెలుగు /పెబ్బేరు : థమిక స్థాయిలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి .మహిళా ఉపాద్యాయుల పాత్ర గణనీయమైనదని మండల విద్యాశాఖాధికారి జయరాములు అన్నారు. పెబ్బేరు పాఠశాల లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖాధికారి జయరాములు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే గొప్పతనం గురించి బాలికల విద్య కోసం ఆమె చేసిన కృషి గురించి . ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి .మహిళా ఉపాద్యాయుల పాత్ర గణనీయమైనదని తమ అమూల్య సందేశాన్ని అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సుదర్శన్ మహిళా ఉపాధ్యాయులను శాలువా; చిరు బహుమతులతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ శ్రీమతి అక్కమ్మ సావిత్రీబాయి ఫూలే జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు గణిత బోధిని( ఎక్కాల పుస్తకం) లను అందించడం జరిగింది.ఈ సమావేశం లో అరుంధతి విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.(Story : విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి మహిళా ఉపాద్యాయుల పాత్ర గణనీయమైనది )