సావిత్రీబాయి ఫూలే గారికి మాజీ మంత్రి నివాళులు
న్యూస్ తెలుగు /వనపర్తి : మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బి.ఆర్.ఎస్ నాయకులతో కలసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజములో ఆన్న మూఢ నమ్మకాలు,రుగ్మతలు,నిరక్షరాస్యతపట్ల అవగాహన కలిగి పట్టుదలతో చదివి భర్త జ్యోతిరావు ఫూలే సహకారముతో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు నిర్వహించి మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే అని కొనియాడారు. మాజీ మంత్రి వెంట గట్టు యాదవ్ ,వాకిటి శ్రీధర్, రమేష్ గౌడ్ ,నందిమల్ల అశోక్ ,కురుమూర్తి యాదవ్ ,జత్రు నాయక్ , ప్రేమ్ నాథ్ రెడ్డి ,కౌన్సిలర్ కంచ రవి ,సూర్యవంశం గిరి ,చిట్యాల రాము , జోహెబ్ హుసేన్, మాజీ సర్పంచులు గౌడ నాయక్ జయరాములు నారాయణ నాయక్ ముద్దు సార్ నాయకురాలు సాయి లీల, కవిత లక్ష్మణ్ బాబు, శివ , అఖిల్ తోట శీను తదితరులు పాల్గొన్నారు.(Story : సావిత్రీబాయి ఫూలే గారికి మాజీ మంత్రి నివాళులు )