UA-35385725-1 UA-35385725-1

టీడీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదు

టీడీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదు

సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు

రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని సీపీఐ ధర్నా

న్యూస్ తెలుగు/చింతూరు : ఇల్లు లేని పేదలకు నగరంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలాలు ఇవ్వాలని సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం వారము ఉదయం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేచించి సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షలు ఆర్థిక సాయం చేయాలని ఆయన డిమాండ్ చేసారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్లు ఇస్తామని వాగ్దానాలు చేయడం జరిగిందని ఆ వాగ్దానాల్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షలు ప్రభుత్వం ఆర్థికసహాయం చేయాలని ఆయన అన్నారుగత ప్రభుత్వం ఎన్నికల ముందు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిందని కానీ స్థలాలు చూపించలేదని ఆయన విమర్శించారు ఈ ప్రభుత్వం వారందరికీ న్యాయం చేయాలని మధు డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి వి కొండలరావు, నగర కార్యవర్గ సభ్యులు సిడగం నౌరుజీ, చింతలపూడి సునీల్, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పి లావణ్య, ఏ ఐ వై ఎఫ్ జిల్లా నాయకుడు త్రిమూర్తులు, ప్రజానాట్య మండలి అధ్యక్షుడు ముప్పన కుమార్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.(Story : టీడీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదు )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1