బిఆర్ఎస్ పార్టీ జీవితభీమా చెక్కుల పంపిణీ
న్యూస్ తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామములో వివిధ కారణాలతో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు బి.ఆర్.ఎస్ పార్టీ జీవితభీమా చెక్కులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారసులకు అందించారు.మొదట బూరమోని.శేఖర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఆయన భార్య జ్యోతికి 2లక్షలు కేశపాగ.బొజ్జన్న రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆయన భార్య గోపలమ్మకి 2లక్షలు అదేవిధంగా బూడిదపాడుకు చెందిన గూడెం.రాముడు విద్యుత్తు షాక్ వల్ల మరణించారు.ఆయన తండ్రి గోకారికి 2లక్షల రూపాయల భీమా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కె.సి.ఆర్ గారు కార్యకర్తల సంక్షేమం కోసం ముందుచూపుతో రైతులు భీమా,కార్యకర్తలకు జీవితభీమా ఏర్పాటు చేశారని కుటుంబ పెద్దను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారికి పెద్దకొడుకువల్లె అండగా నిలిచారని అన్నారు. బూడిదపాడు లో న్యాయవాది కిషోర్ కుమార్ రెడ్డి,నరసింహ రెడ్డి తదితరులు నిరంజన్ రెడ్డి నీ సన్మానించారు.కొత్త సూగుర్ గ్రామములో బి.ఆర్.ఎస్ సీనియర్ కార్యకర్త జూదం.రాజు ఇటీవల మరణించారు వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి తాను అండగా ఉంటానని పిల్లలను చదివించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,గొర్రెల పెంపకం దారుల మాజీ అధ్యక్షులు కురుమూర్తి యాదవ్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్, మాజీ Z.P.T.C పద్మ వెంకటేష్, కర్రెస్వామి,వనం.రాములు, కృష్ణా రెడ్డి,దేవేందర్ రెడ్డి,వేణు రెడ్డి, ఎల్లా రెడ్డి,పాతపల్లి.గోవిందు,కిషోర్ కుమార్ రెడ్డి,వడ్డే.రమేష్,జూదం.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.(Story : బిఆర్ఎస్ పార్టీ జీవితభీమా చెక్కుల పంపిణీ)