కెసిఆర్ సుదీర్ఘ పోరాటం వల్లే తెలంగాణ
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : కెసిఆర్ సుదీర్ఘ పోరాటం 11రోజుల ఆమరణ దీక్ష వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ 9న వెలువడిందని ఎవరి దయాధాక్షిణ్యాల వల్లగాని రాలేదని కె.సి.ఆర్ పోరాట అర్హత,దక్షత వల్లనే రాష్ట్ర ప్రకటన వెలువడిన రోజు కాబట్టి విజయ దివాస్ జరుపుకుంటున్నామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ధీక్షా దివాస్ రోజు సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గోపాల్ పేట మండల కేంద్రంలో తెలంగాణతల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంత్ , అమరవీరులు పోలీస్ కిష్టయ్య,యాదయ్య,సువర్ణ తదితరులకు నివాళులు అర్పించారు. కె.సి.ఆర్ 14 ఏండ్ల సుదీర్ఘ పొర్రటంతో రాష్ట్రాన్ని సాధించి అధికారం చేపట్టి తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం చేపట్టి అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టా రని అన్నారు. రెండు తరాల పోరాటం తర్వాత మూడవ తరం కెసిఆర్ నాయకత్వములో సాధించుకున్న తెలంగాణ చేజారి నేటికీ సంవత్సరం అయ్యిందని నేటి పాలకులు 100రోజుల్లో చేస్తామన్న హామీలు సంవత్సరం అయినా నెరవెరక ప్రజలు నానా గోసపడుతున్నారని అన్నారు. తెలంగాణ లక్ష్యాలు నెరవేర్చుకొనుటకు మరో ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకత మళ్ళీ ఏర్పడిందని తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండి కె.సి.ఆర్ గారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. డాక్టర్.అంబేద్కర్ కి నిరంజనుడి ఘన నివాళులు. గోపాల్ పేట మండల కేంద్రంలో నూతనంగా ఆవిష్కరించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతిరావు పూలే, జాగ్జీవన్ రామ్ గార్లకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి,గోపాల్ పేట పట్టణ,మండల నాయకులు పాల్గొన్నారు. (sTORY ;కెసిఆర్ సుదీర్ఘ పోరాటం వల్లే తెలంగాణ)