ఇస్లాంపేట వాసుల సమస్యలు పరిష్కారిస్తా
మున్సిపల్ కమీషనర్
న్యూస్ తెలుగు /వినుకొండ : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు ఆదేశానుసారం వినుకొండ మునిసిపల్ కమీషనర్ వాడ వాడలా పర్యటిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నాయి అధికారులు వస్తున్నారు పోతున్నారని తాము మాత్రం నిర్లక్ష్యానికి గురవుతూ మునిసిపల్ సేవలు పొందుటకు అనేక పోరాటాలు చేస్తున్నామని అయినా కానీ తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడంలేదని, 16 వ వార్డ్ ఇస్లాంపేట వాసులు కమీషనర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు . తమ గృహాలకు ఇంటి పన్నులు వేసి ప్రతి ఇంటికి నీటి కొళాయిలు ఏర్పాటు చేయాలని, నిమ్మలబావి ప్రాంతంలో గ్రీనరీ ఏర్పాటుకు ఉన్న అవకాశాన్ని పరిశీలించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, 16 వార్డ్ టీడీపీ ఇంచార్జ్ అక్బర్ భాషా నేతృత్వంలోని ఇస్లాంపేట వాసులు కమీషనర్ ను అభ్యర్థించారు. మున్సిపల్ కమీషనర్ స్పందిస్తూ ఆర్థిక వెసలుబాటు రీత్యా ప్రాధాన్యతా క్రమంలో ఇస్లాంపేట నివాసితులకు అందవలసిన అన్ని సేవల్ని త్వరితగతిన అందించదమని హామీ ఇచ్చారు. (Story : ఇస్లాంపేట వాసుల సమస్యలు పరిస్కారిస్తాం)