రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయండి
ఎమ్మార్వో కూర్మనాథరావు
న్యూస్‌తెలుగు/విజయనగరం : నేటి నుంచి ప్రారంభం కానున్న రెవెన్యూ సదస్సులను అందరి సహకారంతో విజయవంతం చేయాలని మండల పరిషత్ ప్రత్యేక అధికారి బి అరుణకుమారి తహసిల్దార్ ఎన్ కూర్మనాధరావు అన్నారు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి బి అరుణ్ కుమారి, ఎం ఆర్ ఓ ఎన్ కూర్మనాధరావు మాట్లాడుతూ నేటి నుండి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.
గ్రామాల్లో భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 6వ తేది నుంచి జనవరి 8వ తేది వరకూ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, రెవెన్యూ సదస్సుల్లో తప్పకుండా పాల్గొని తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఆయా గ్రామాల్లో గల సమస్యలను నాయకులు అధికారుల దృష్టికి తీసుకు రావడం జరిగిందన్నారు. రెవెన్యూ సమస్యల పరిశ్రమే లక్ష్యంగా ప్రభుత్వం సదస్సులు నిర్వహిస్తుందని తెలిపారు. గ్రామాల్లో ఏ రోజున సదస్సులు నిర్వహిస్తామో గ్రామస్తులకు ముందుగానే తెలపాలన్నారు. అలా చెప్పడం ద్వార వివిధ పనుల మీద వేరే ప్రాంతానికి వెళ్ళిన వారు సైతం సదస్సులకు హాజరయి తమ సమస్యలు పరిష్కరించుకునే అవకాసం ఉంటుందన్నారు. అలగే సభలు జరిగిన రోజున అన్ని శాఖల అధికారులు గ్రామానికి సంబందించిన పూర్తి సమాచారంతో హాజరు అవుతారన్నారు. అక్కడిక్కడే పరిష్కారం అయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని, విచారణ జరిపి పరిష్కరించవలిసిన సమస్యలను జనవరి 8వ తేది నుంచి 45 రోజుల్లోగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలందరూ ఈ సదస్సులను వినియోగించుకుని ప్రయోజనం పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు మరియు మండల అధికారులు పాల్గొన్నారు. (Story : రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయండి )