పెంచిన కరెంటు చార్జీలను ఉపసంహరించుకోవాలి
స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి
మారుతి వరప్రసాద్ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి
న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై పెంచిన 15 వేల కోట్ల విద్యుత్ చార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని, గృహాల కరెంటు వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించే ఆలోచన విరమించుకోవాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. గురువారం నాడు సిపిఐ వినుకొండ నియోజకవర్గ కమిటీ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ కూటమిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చారని వాటిలో ముఖ్యంగా కరెంటు చార్జీలు పెంచబోమని వైసిపి ప్రభుత్వం పెంచిన విధంగా కరెంటు ట్రూ అప్ చార్జీలు చార్జీలు పెంచబోమని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు రాష్ట్రంలో గత ప్రభుత్వం కట్టవలసిన కరెంటు బకాయిలంటూ ప్రజలపై 15 వేల కోట్ల రూపాయల కరెంటు ట్రూ అప్ చార్జీల భారాలను వేయడం అన్యాయమని వెంటనే కరెంటు చార్జీల భారాన్ని ఉపసంహరించుకోవాలని, గతంలో సాయిబాబా సంస్థల ద్వారా ఆనాడు అదాని సృష్టించిన స్మార్ట్ మీటర్లను తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించిందని నేడు అదే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు స్మార్ట్ మీటర్లను అంటగట్టడం తగదని దీనిని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కరెంటుచార్జిలు ఉపసంబరించుకోనియడల మరో కరెంటు ఉద్యమం రాష్ట్రంలో మొదలవుతుందని ఆయన అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సోలార్ ఎనర్జీ ఒప్పందాలను ఆనాడు యూనిట్ రు. 1.99 పైసలు ఉంటే అదానీ కంపెనీలతో యూనిట్ రు. 2.49 పైసలకు అంటే యూనిట్ కు అదనంగా 50 పైసలు అక్రమ ఒప్పందాలు చేసుకుందని ఈ ఒప్పందాల ఫలితంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు 1750 కోట్ల రూపాయల లంచాల రూపంలో అందాయని ఈ విషయాన్ని అమెరికా కోర్టులో కేసులు నమోదయ్యని ఇది భారతదేశ మొత్తం తెలిసిందని ఆ కేసులు అమెరికాలో నమోదయ్యే దాకా మనకు ఎవరికి తెలియదని మనదేశంలో కూడా దీనిపై ఎవరు చర్చించలేదని మన దేశ ఆంతరంగిక విషయాలు లంచాలు కుంభకోణాలు ఇతర దేశాలలో అవినీతి చరిత్రలుగా కోర్టులకెక్కుతున్నాయని ఆయన విమర్శించారు. ఆదానితో ఈ సోలార్ ఎనర్జీ ఒప్పందాలను వెలికి తీసి కేసులు నమోదు చేసి పార్లమెంట్లో జేపీసీ వేసి విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు 9, 10 తేదీలలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జరిగే ఆందోళన కార్యక్రమాలను జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో మండలాలలో నిర్వహించాలని ఆయన కోరారు.భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100వ ఆవిర్భావ దినోత్సవాలను డిసెంబర్ 26న దేశం మొత్తం కష్టజీవుల అండ ఎర్రజెండా రెపరెపలు ఒక పండుగలా జరుగుతుందని మన పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ శాఖలలో పట్టణాలలో నగరాలలో ఎర్రజెండాల ఆవిష్కరణ గావించి సభలు సమావేశాలు నిర్వహించి పార్టీ గత 100 సంవత్సరాలుగా దేశ ప్రజలకు చేసిన త్యాగాలు చరిత్ర గురించి తెలియజేయాలని ఆయన వివరించారు పార్టీ సభ్యత్వాలను పునరుద్ధరించుకోవాలని శాఖా సమావేశాలు అన్నింటినీ పూర్తి చేయాలని ఆయన కార్యకర్తలను ఆదేశించారు. సమావేశానికి సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ సండ్రపాటి సైదా, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, సిపిఐ నాయకులు పఠాన్ లాల్ ఖాన్, పెన్నబోయిన వెంకటేశ్వర్లు,ఎ. పవన్ కుమార్, వూట్ల రామారావు సమావేశంలో పాల్గొని నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. (Story : పెంచిన కరెంటు చార్జీలను ఉపసంహరించుకోవాలి)