రాజ్యాంగం అందరికి ఆదర్శం
న్యూస్ తెలుగు /సాలూరు : రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సాలూరు పట్టణం 4వ వార్డులో నవభారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యా రాణి మంగళవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ డా.బీ.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించించి ప్రజలు ఏ విధంగా ఉండాలి, వారి హక్కులు, విధులు ప్రతీ ఒక్కరికీ తెలియజేసి మంచి మార్గంలో నడిపించే విధంగా చేశారని చెప్పారు. భారత రాజ్యాంగంలో అందరూ కలసి మెలసి మెలగాలని ప్రధాన లక్ష్యంగా సాగిందని అన్నారు. కులమతాలు లేకుండా వర్ణ, వర్గ విభేదాలు లేకుండా అందరం కలసి భారత దేశ స్వాతంత్ర్య ఫలాలని అందుకోవాలని ముఖ్యంగా అట్టడుగున వున్నటువంటి అణగారిన వర్గాలను బయటకు తీసుకురావాలని ఒక మంచి ప్రయత్నంతో రాజ్యాంగాన్ని పొందుపరిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బంజు దేవ్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మది తిరుపతిరావు శ్యామలంబ ఆలయ కమిటీ చైర్మన్ అక్కిన అప్పారావు స్థానికులు పాల్గొన్నారు. (Story : రాజ్యాంగం అందరికి ఆదర్శం)