సత్య డిగ్రీ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహణ
న్యూస్‌తెలుగు/విజయనగరం : సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కళాశాల లో విద్యార్థులకు క్విజ్ , వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమలులోనికి వచ్చిందని, ఆ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేత్కర్ సారథ్యం లో డ్రాఫ్టింగ్ కమిటీ దాదాపు మూడేళ్లు అవిశ్రాంతంగా శ్రమించి రూపొందించిందన్నారు. భారత రాజ్యాంగ పరిషత్ దాన్ని కూలంకషంగా పరిశీలించి 1949 నవంబర్ 26న ఆమోదించిందని. అదే మన రాజ్యాంగ దినోత్సవం గాజరుపుకుంటున్నమన్నారు. కళాశాల పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు ఎస్. మహేష్ రాజ్యాంగం గురించి విద్యార్థులకు వివరంగా చెప్పారు. క్విజ్ , వక్తృత్వ పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి, ఎన్ సి సి ఆఫీసర్లు కెప్టెన్ ఎం సత్య వేణి, లెఫ్టినెంట్ ఎం. ఉదయ్ కిరణ్, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ బి సూరపు నాయుడు, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలు సి. కేతన, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : సత్య డిగ్రీ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహణ)