సాలూరు లో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
రైతుల డిమాండ్
న్యూస్ తెలుగు/ సాలూరు ; పత్తి కి గిట్టుబాటు ధర లేక పోవడంతో దిగులు చెందుతున్న రైతులు. సాలూరు లో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతుల డిమాండ్. పత్తి కొనుగోలు కేంద్రం సాలూరులో లేకపోవడంతో రైతులు తక్కువ రేట్ కి అమ్మడం జరుగుతుంది. భూసాయ వలసలో ఉన్న నందిని జిన్నింగ్ మిల్లువారు ప్రతి గ్రామంలోనే వాళ్ల బ్రోకర్లను నియమించుకొని పత్తి ధర తక్కువకు కొనుగోలు చేయడం జరుగుతుంది దీనివలన పత్తి రైతులు ఎక్కువగా ఉన్న మక్కువ పాచిపెంట సాలూరు మండల రైతులు తీవ్రంగానష్టపోతున్నారు. ఈ సంవత్సరం ధర 6100 నుండి 6300 వరకు ప్రైవేట్ వ్యాపారస్తులు కుంటున్నారు. ప్రభుత్వం మద్దతు ధర 7,521 వరకు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అ స్పందించి ప్రతి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లయితే.రైతులకు మద్దతు ధర వస్తుందని రైతులు కోరుతున్నారు. ఎకరా పత్తికి సుమారు 20,000 నుంచి 25 వేల వరకు మదుపు అవుతుంది. ఎకరాకు మూడు నుంచి నాలుగు క్వింటాళ్లు వరకే దిగుబడి ఈ సంవత్సరం వచ్చింది. ధర తక్కువగా ప్రైవేట్ వ్యాపారస్తులు కొనడం వలన రైతులకు పెట్టిన పెట్టుబడి రావడం లేదు . గతంలో ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడం వలన పెట్టుబడి ఖర్చులకి రైతులకి ఉండేది. ఈ సంవత్సరం పెట్టుబడి ఖర్చులకు రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు తీసుకుని వ్యవసాయ మదుపు పెట్టడం జరిగింది. ధర లేకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వాలని ఉద్దేశంతో తక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది. ప్రజా ప్రతినిధులు స్పందించి ప్రతి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయవలసిందిగా పత్తి రైతులు కోరుతున్నారు. (Story : సాలూరు లో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి)