ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించండి
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు
న్యూస్‌తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఇందుకు నిరసనగా ఈనెల 28వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె పిలుపు కారణంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సిఐటియు మండల కన్వీనర్ జే వి రమణ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ సమావేశానికి బొగ్గు నాగరాజు అధ్యక్షత వహించడం జరిగినది అని తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28వ తారీఖున మున్సిపల్ కార్యాలయం నందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడానికి ప్రతి ఒక్కరు హాజరుకావాలని పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా గత వైఎస్ఆర్ ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 16 రోజులు సమ్మె నిర్వహించిన సందర్భంగా కార్మికులకు స్కిల్ ,సెమిస్కిల్డ్ ఆధారంగా వేతనాలు అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదని అదేవిధంగా హెల్త్ అలవెన్స్ వర్తింపచేయాలని, ఈఎస్ఐ ఆసుపత్రిని ధర్మవరంలో ఏర్పాటు చేయాలని ,ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని వారు తెలిపారు. వివిధ రకాల సమస్యల పరిష్కారం పై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఆందోళన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో జి అనిల్, మహేష్, పెద్దన్న ,దాసరి సురేష్, మరియు ఇంజనీరింగ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. (Story : ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించండి)