కాలువ బండ్‌లను సుందరి కరించండి
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : నగరంలోని కాలువ బండ్‌లలో ఉన్న వ్యర్ధాలను తొలగించటంతో పాటు కాలువ బండ్‌లను సుందరీకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సంబందిత అధికారులను ఆదేశంచారు. నగర పర్యటనలో భాగంగా కమిషనర్ శుక్రవారం మధురానగర్ వద్ద ఏలూరు కాలువ బండ్‌ను ఇంజనీరింగ్ అధికారులతో పరిశీలించారు. ఏలూరు కాలువకు ఇరువైపుల ఉన్న బండ్‌లలో ఆక్రమణలు జరుగకుండా ఫెన్సింగ్ వేయటంతో పాటు మొక్కలు నాటి సుందరీకరించాలని అధికారులను ఆదేశించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలకు కొరకు వాకింగ్ ట్రాక్, పాత్ వే, ఆట పరికరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో చేపట్టిన ఈ పనులను త్వరతిగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ పర్యటనలో సూపరిండెంటింగ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. (Story : కాలువ బండ్‌లను సుందరి కరించండి)