Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వాలంటరీ సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడి చేస్తాం

వాలంటరీ సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడి చేస్తాం

0

వాలంటరీ సమస్యలు పరిష్కరించకపోతే

అసెంబ్లీ ముట్టడి చేస్తాం

న్యూస్‌తెలుగు/ చింతూరు  : చింతూరు డివిజన్ పరిధిలో నాలుగు మండలాల్లో ఉన్న వాలంటరీ సమస్యలు పరిష్కరించాలని రెండో రోజు రిలే నిరాహార దీక్షని కూనవరం వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చింది. గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ ద్వారానే అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందజేయడం జరిగింది. గత ప్రభుత్వం వాలంటరీ వాళ్ళని మోసం చేసింది కూటమి ప్రభుత్వం అధికారం రాగానే వాలంటరీ కు గౌరవ వేతనంగా పదివేల రూపాయలు ఇస్తామన్న మాట ఎక్కడికి పోయిందని అన్నారు. వాలంటరీ కి ఉద్యోగ భద్రత కల్పించాలి. పెండింగ్ వేతనాలు చెల్లించాలి. బలవంతపు రాజీనామా చేయించిన వారిని తిరిగి మళ్లీ వీధిలోకి తీసుకోవాలి. బలవంతపు రాజీనామా చేయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాను అలానే వాలంటరీ వాళ్ళని గౌరవంగా పదివేల రూపాయలు ఇస్తానన్న మాట కూడా నిలబెట్టుకోవాలని అన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్ అందరినీ ఐక్యం చేసి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. రెండవ రోజు రిలే నిరాహార దీక్ష కి మద్దతుగా గ్రామపంచాయతీ కార్మికులు మద్దతు తెలిపారు. మద్దతు తెలిపి ఈ సందర్భంగా గ్రామపంచాయతీ నాయకురాలు రాములమ్మ మాట్లాడుతూ మీరు చేస్తున్న పోరాటానికి మా గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా అండగా ఉంటామని అన్నారు. గ్రామ వాలంటరీ రిలే నిరాహార దీక్షకి వైసిపి నాయకులు మద్దతు తెలిపి ఈ సందర్భంగా జెడ్పిటిసి చిచ్చడి మురళి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను కాపాడుకోవాలి వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్ ముట్టం రాజయ్య. చింతూరు మండల ఎంపీపీ సవలం అమల. వైస్ ఎంపీపీ చిన్ని .వాలంటరీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పొడియన్ జానీ. నాలుగు మండలాల వాలంటరీ యూనియన్ మండల అధ్యక్షులు కార్యదర్శులు. కలుములు మహేష్. సాదులు రామిరెడ్డి . కుమార్. బద్రు. నాగరాజు. పద్మావతి. శాంతి. దుర్గారావు. వనరాజ్. తదితరులు పాల్గొన్నారు. (Story : వాలంటరీ సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడి చేస్తాం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version