Home వార్తలు  ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి పొంగల్ సాంగ్ 

 ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి పొంగల్ సాంగ్ 

0

 ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి పొంగల్ సాంగ్ 

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా : విక్టరీ వెంకటేష్ హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మొదటి రెండు పాటలకు చార్ట్‌బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగల్ గోదారి గట్టు గ్లోబల్ టాప్ 20 వీడియోస్ లిస్టు లో ప్రవేశించగా, సెకండ్ సింగిల్ మీను కూడా అన్ని మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో ఉంది.

మేకర్స్ థర్డ్ సింగల్ బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 30న పొంగల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్  హీరో వెంకటేష్, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్  కలర్ ఫుల్, సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్  తో కనిపించడం అదిరిపోయింది.

ఈ సాంగ్ కోసం భీమ్స్ సిసిరోలియో సంక్రాంతి ఫెస్టివల్ వైబ్ ని హైలైట్ చేసే మరో అద్భుతమైన నెంబర్ ని కంపోజ్ చేశారు. విక్టరీ వెంకటేష్ స్వయంగా ఈ పాట పాడటం బిగ్గెస్ట్ ఎట్రాక్షన్. ఈ ఎనర్జిటిక్, కలర్‌ఫుల్ నంబర్ కు భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సాంగ్ సినిమా మెయిన్ హైలైట్‌లలో ఒకటిగా ఉంటుంది.

ఈ చిత్రంలో వెంకటేష్ ఎక్స్ పోలీస్ పాత్రలో, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించనున్నారు.

దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి నిర్వహిస్తుండగా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
కో రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
యాక్షన్ డైరెక్టర్: వి వెంకట్
VFX: నరేంద్ర లోగిసా
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా (Story :  ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి పొంగల్ సాంగ్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version