జిల్లాలల్లో పలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కృషి
అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం.మంత్రి సీతక్క
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : మారుమూల ప్రాంతాల అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు.
శుక్రవారం వెంకటాపూర్ మండలంలోని జవహర్ నగర్ వద్ద రామాలయం చుట్టూ 5 లక్షల ఎస్ డి ఎఫ్ నిధులతో నిర్మించిన కాంపౌండ్ గోడ ను,
గోవిందరావు పేట మండలం, చాల్వాయి ఆదర్శ పాఠశాల లో కంప్యూటర్ ల్యాబ్,
(సి ఎస్ ఆర్ నిధులు మౌరిటెక్ ఐటి సంస్థ సౌజన్యం) 10 కంప్యూటర్లు, చాల్వాయి లోని ట్రైనింగ్ సెంటర్లో ఎస్ హెచ్ జి మహిళలకు, ఉష ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ సౌజన్యంతో కుట్టు మిషన్
25 రోజుల శిక్షణ, ఉత్పత్తి కేంద్రంను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., గ్రంథాలయ చైర్మన్ రవి చందర్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇంచార్జీ సంపత్ రావులతొ కలసి మంత్రి ప్రారంభించారు. అనంతరం వెంకటాపూర్ మండలంలోని జవహర్ నగర్ మాడల్ స్కూల్ ను మంత్రి సందర్శించారు.ఈ సందర్భంగా మంత్రి పాఠశాలల్లో విద్యార్థులకు అందుకున్న విద్యను గురించి అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలో విద్యార్థులకు కుర్చీలు, టేబుల్స్, ఫర్నిచర్ సరిపడలేవని, పిల్లలు ఆటలు ఆడుకోవడానికి గ్రౌండ్ లెవెలింగ్, కాంపౌండ్ వాల్ లేదని ప్రిన్సిపాల్ మంత్రి కి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విద్యావ్యవస్థను పట్టింపు లేక విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని, మా ప్రభుత్వం విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత నిస్తుందని అన్నారు. ప్రైవేట్ రంగానికి దిటుగా పాఠశాలలను తీర్చుదిద్దుతున్నామని అన్నారు. ఉపాధ్యాయులు ఓపికగా, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యను బోధించాలని సూచించారు.
జిల్లాలో అర్హులైన పేదవారందరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం పేదవాడి గురించి కనీస ఆలోచన చేయలేదని విమర్శించారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందుల ఎదురైనా అభివృద్ది సంక్షేమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించినా, ఏదీ ఆగదని పేదవాడి కన్నీరు తుడవడమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు.పలు అంశాలపై మంత్రి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డి ఈ, మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు, పాల్గొన్నారు. (Story :జిల్లాలల్లో పలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క)