Home వార్తలు ‘విడాముయర్చి’ నుంచి  ‘స‌వదీక‌’ సాంగ్ రిలీజ్‌

‘విడాముయర్చి’ నుంచి  ‘స‌వదీక‌’ సాంగ్ రిలీజ్‌

0

‘విడాముయర్చి’ నుంచి  ‘స‌వదీక‌’ సాంగ్ రిలీజ్‌

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా : అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయ‌ర్చి’. ఈ సినిమా వ‌చ్చే 2025 సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచ‌నాల‌తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

రీసెంట్‌గా విడుద‌లైన విడాముయ‌ర్చి సినిమా టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. ఈ అంచ‌నాల‌ను నెక్ట్స్ ల‌వెల్‌కు తీసుకెళుతూ మేక‌ర్స్ ఈ మూవీ నుంచి ‘స‌వదీక‌’ అనే ఫాస్ట్ బీట్ ఎన‌ర్జిటిక్ సాంగ్‌ను మేక‌ర్స్ శుక్ర‌వారం రోజున విడుద‌ల చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద‌ర్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన త‌న‌దైన శైలిలో మ‌రో సూప‌ర్బ్ ట్యూన్‌తో స‌వ‌దీక సాంగ్‌ను కంపోజ్ చేశారు. ఆంథోని దాస‌న్ పాడిన ఈ పాట‌ను అరివు రాశారు.

స్టార్ హీరోల‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను, వైవిధ్య‌మైన చిత్రాల‌తో యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ సినిమాల‌ను నిర్మిస్తోన్న ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్ నేతృత్వంలో సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇంకా ఈ చిత్రంలో ఆర‌వ్‌, రెజీనా క‌సండ్ర‌, నిఖిల్ నాయ‌ర్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు.

కోలీవుడ్  రాక్ స్టార్ అనిరుద్ సంగీతాన్నిఅందిస్తుండ‌గా ఓం ప్ర‌కాష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎన్‌.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఇంకా ఈ చిత్రానికి సుంద‌ర్ స్టంట్స్‌ను కంపోజ్ చేయ‌గా, అను వ‌ర్ధ‌న్ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా ప‌ని చేశారు. సుబ్ర‌మ‌ణియ‌న్ నారాయ‌ణ‌న్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, జె.గిరినాథ‌న్‌, కె.జ‌య‌శీల‌న్ ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్‌గా వ‌ర్క్ చేశారు. ఇంకా జి.ఆనంద్ కుమార్ (స్టిల్స్‌), గోపీ ప్ర‌స‌న్న (ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌), హ‌రిహ‌ర‌సుత‌న్‌(వి.ఎఫ్‌.ఎక్స్‌), సురేష్ చంద్ర (పి.ఆర్‌.ఒ-త‌మిల్‌), నాయుడు సురేంద్ర‌ కుమార్‌ – ఫ‌ణి కందుకూరి (పి.ఆర్.ఒ – తెలుగు) సినిమాలో భాగ‌మయ్యారు.

అజిత్ కుమార్  ‘విడాముయ‌ర్చి’ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది. (Story :‘విడాముయర్చి’ నుంచి ‘స‌వదీక‌’ సాంగ్ రిలీజ్‌

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version