ప్రజలపై కరెంటు చార్జీల పిడుగు వేసిన కూటమి ప్రభుత్వం
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శనివారం కరెంటు చార్జీల బాదుడు పై వైస్సార్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు నిర్వహించారు. స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నుండి కారంపూడి రోడ్ లోని కరెంటు ఆఫీస్ వద్ద కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కరెంటు ఆఫీసు వద్దకు చేరుకొని ప్రజలపై కూటమి ప్రభుత్వం మోపిన భారాన్ని తగ్గించాలని, డిమాండ్ చేస్తూ విద్యుత్ అధికారులకు మెమోరాండం అందజేశారు. అనంతరం బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ. ప్రజలపై కరెంటు చార్జీల పిడుగును కూటమి ప్రభుత్వం వేసిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పాలన సాగుతోందని అన్నారు. కరెంటు చార్జీలు పెంచబోనని హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్లేటు మార్చేశారని అన్నారు. ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనతో కరెంటు చార్జీలు తగ్గిస్తానంటూ బూటకపు హామీలు గుప్పించిన బాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తుంగలో తొక్కారు. ఆరు నెలలు తిరక్కుండానే జనంపై సుమారు 15 వేల 4వందల 85 కోట్ల రూపాయల భారం పెంచనున్నారు. అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లేయించుకుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న పని బాదుడే బాదుడు. ప్రతీ నెల వచేదనికంటే సుమారు 200 రూపాయల బిల్ ఎక్కువ వస్తుందని ప్రజలు వాపోతున్నారు. గతంలో మా ప్రభుత్యం అమలు చేసిన ఎస్సి, ఎస్టి లకు 200 యునుట్ల ఉచిత విద్యత్ ని కూడా రద్దు చేసేవిదంగా వారిని కూడా బిల్ లు కట్టమని వత్తిడి చేస్తున్నారు. కోత్తగా వ్యవసాయ పంపు సేట్లకి పెట్టుకునే వారికీ అనుమతులు ఇవ్వకుండా రైతులని కూడా ఇబ్బంది పెడుతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోరని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : ప్రజలపై కరెంటు చార్జీల పిడుగు వేసిన కూటమి ప్రభుత్వం )