Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ధర్మవరం ఎంఈఓ ఆఫీస్ వద్ద నిరసన దీక్ష కార్యక్రమం

ధర్మవరం ఎంఈఓ ఆఫీస్ వద్ద నిరసన దీక్ష కార్యక్రమం

0

ధర్మవరం ఎంఈఓ ఆఫీస్ వద్ద నిరసన దీక్ష కార్యక్రమం

సిఐటియు

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ మరియు కంటెంజెంట్ స్కూల్ ఆయాల సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిరసన దీక్ష కార్యక్రమం ఐ.లక్ష్మీదేవి అధ్యక్షతన. ఈ కార్యక్రమం చేపట్టడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఆదిశేషు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు, జేవీ రమణ సిఐటియు మండల కన్వీనర్, టీ.అయూబ్ ఖాన్.మండల కో కన్వీనర్, డి చంద్రకళ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ ప్రాజెక్టు కార్యదర్శి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛభారత్ పేరుతో కార్మికులను ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ పనిచేయిస్తూ వారికి కేవలం 6000 వేతనం ఇస్తున్నారని, అదేవిధంగా కంటెన్ జెంట్ ఆయాలకు కేవలం 4000 రూపాయలు వేతనాలు ఇస్తున్నారని ,ప్రభుత్వం చేనేత, వృద్ధులకు ప్రతి నెల ఒకటో తారీఖున 4000 రూపాయలు వారి ఇంటి వద్దకు వెళ్లి ఇస్తున్నారని ,వికలాంగులకు 6000 రూపాయలు వారి ఇంటి వద్దకు వెళ్లి ఇస్తూ వారిని ఆదుకుంటున్నారని వారి కుటుంబాలు ఇబ్బందులు కాకుండా చూస్తున్నారని, అదేవిధంగా పనిచేస్తున్న కార్మికులకు ప్రతినెల వేతనాలు మంజూరు చేయాలని ,కార్మికుల కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ,పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ఏర్పాటు చేయాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని ,పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, వారు ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగినది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకరోజు కార్మికులు వెళ్లకుండా ఉంటే ఆ పాఠశాలలో విద్యార్థులు గాని, ఉపాధ్యాయులు గాని ఆ దుర్వాసన భరించలేరని, కావున ప్రభుత్వాలు విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం కాపాడడానికి స్వచ్ఛభారత్ కార్మికులను విధులలోకి తీసుకున్నారని అటువంటి కార్మికుల జీత భత్యాల విషయంలో, వారి ఆరోగ్య విషయాలలో కూడా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఈఓ గోపాల్ నాయక్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఎంఈఓ మాట్లాడుతూ తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళతానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్ నాగ వేణి, జయమ్మ ,చౌడమ్మ ,ముంతాజ్, మున్సిపల్ ఇంజనీరింగ్ నాయకులు బొగ్గు నాగరాజు ,అనిల్ ,రాము ,పెద్దన్న, అంగన్వాడీ నాయకురాలు దీన, పోతక్క, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన దీక్షను విజయవంతం చేయడం జరిగినది. (Story : ధర్మవరం ఎంఈఓ ఆఫీస్ వద్ద నిరసన దీక్ష కార్యక్రమం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version