Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రూరల్ క్రికెట్ లీగ్ లో సత్తా చాటిన క్రీడాకారులు

రూరల్ క్రికెట్ లీగ్ లో సత్తా చాటిన క్రీడాకారులు

0

రూరల్ క్రికెట్ లీగ్ లో సత్తా చాటిన క్రీడాకారులు

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : ఆర్డిటి నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ లీగ్‌లో క్రికెట్ క్రీడాకారులు తమ సత్తాను చాటడం జరిగిందని కోచ్ రాజశేఖర్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బత్తలపల్లి లో బత్తలపల్లి అండర్-15 బాలుర జట్టు, ధర్మవరం అండర్-15 బాలుర జట్టు తలపడ్డగా,ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ధర్మవరం జట్టు 33 ఓవర్లలో 153/10 చేసింది అని తెలిపారు.ధర్మవరం జట్టులోని బన్నీ 79 (67) పరుగులతో సత్తా చాటా రు అని తెలిపారు.బత్తలపల్లి జట్టు బౌలర్ నరసింహ 4 వికెట్లు ,.అనాథరం బ్యాటింగ్‌కి దిగిన బత్తలపల్లి జట్టు 31.1 ఓవర్లలో 100/10 పరుగులు చేయడంతో ధర్మవరం జట్టు 53 పరుగుల తేడతో విజయం సాధించింది అని తెలిపారు. బత్తలపల్లి జట్టులోని సాయి కుమార్ 40 పరుగులు చేయగా,ధర్మవరం జట్టులోని కుందన్ 4 వికెట్లు, సాంబశివ 2 వికెట్లు జస్వంత్ 2 వికెట్లు సాధించారు అని తెలియజేశారు. విజేతలకు కోచ్ శుభాభినందనలు తెలిపారు (Story : రూరల్ క్రికెట్ లీగ్ లో సత్తా చాటిన క్రీడాకారులు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version