Home వార్తలు తెలంగాణ రైతుబంధు పేరుతో పందేడ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు

రైతుబంధు పేరుతో పందేడ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు

0

రైతుబంధు పేరుతో పందేడ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు

రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

న్యూస్ తెలుగు/వనపర్తి : గత పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వ హాయంలో చిన్న సన్న కారు రైతులకు అందవలసిన పంట పెట్టుబడిని వారి హాయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు ఎంపీపీలు జెడ్పిటిసిలు ఒక్కొక్కరు బీడు పడ్డ వందల ఎకరాల భూములకు రియల్ ఎస్టేట్ భూములకు లక్షల రూపాయలు తీసుకొని సోమ్ము చేసుకొని పదేండ్లు రాష్ట్రాన్ని రైతుబంధు పేరుతో దోచుకొని లూటీ చేసి ఇవాళ ధర్నాలు నిరసనలు చేయడం సిగ్గుచేటుగా ఉందని తెలియజేస్తున్నాం అని కిసాన్ కాంగ్రెస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు ఎన్నికల ముందు బూటకపు మాటలతో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి పది సంవత్సరాలైనా రుణమాఫీ చేయలేక చేతులెత్తేసి వాయిదాల మాఫీ చేసి వడ్డీలకు వడ్డీలు కట్టి రైతుల నడ్డి విరిసిన మీరు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది రైతుల ఆగ్రహానికి గురి అయిన మీరు ఈరోజు తగదు నమ్మని నిరసనలు చేసినంత మాత్రాన రైతులు నమ్మడానికి సిద్ధంగా లేరు అని గుర్తించాలి.రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజమైన పంట వేసిన రైతుకే సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కోసం జాప్యం జరుగుతుంది తప్ప రైతుబంధు పేరుతో బురద జల్లి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తే అది సాధ్యం కాదు నిజమైన రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తుందని తెలియజేస్తున్నాను. గత 10 ఏండ్లు అకాల వర్షాలకు పంట నష్టపోతే పంటల బీమా ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వని దుర్మార్గులు బీఆర్ఎస్ నాయకులు అధికారం పోయిందని ప్రతిపక్ష పార్టీ నేతలు సోయ లేకుండా మాట్లాడుతూ రైతులకు వచ్చే రాయితీలును అన్ని రద్దుచేసి పదేళ్లపాటు రైతుల గురించి మాట్లాడని వారు ఇవాళ రైతుల జపం చేస్తున్నారు అసలు బీఆర్ఎస్ నాయకులకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు వారి చిల్లర రాజకీయాలు మానుకోవాలని తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఖరీఫ్ నుంచే రైతులు సాగుచేసిన సన్న రకం దాన్యం కు 500 బోనస్ అమలు చేయడం. ఈ ఖరీఫ్ సీజన్ నుండే ప్రతి రైతు పంటకు పంటల బీమా పథకం ప్రభుత్వమే ప్రీమియం చెల్లించడం.ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా డిసెంబర్ 9 కల్లా సంకేదిక కారణాల వలన తప్పిదాల వల్ల రుణమాఫీ కానీ రైతులకు రుణమాఫీ అవుతుందని తెలియజేస్తున్నాను. రైతులకు రైతుబంధు పేరు చెప్పి రైతులకు వచ్చే రాయితీలను అన్ని రద్దు చేసి అన్ని రోగాలకు జింద దిలిస్మాత్ మాదిరిగా రైతులను ఇబ్బందులు పెట్టి ఈరోజు సోయి ధ్యాస లేకుండా ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని విచిత్రమైన కలలుగంటున్నారని తెలియజేస్తున్నాను.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జెసిపి రాములు సాగర్, రాములు యాదవ్ పాల్గొన్నారు.(Story:రైతుబంధు పేరుతో పందేడ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version